సిద్ధవటం( ప్రజా సీమ )
సిద్ధవటం మండలం మాచుపల్లె గ్రామంలో వెలసిన శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లిని ఆదివారం మధ్యాహ్నం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి శనివారం మోహన్ రెడ్డి దర్శించుకోవడం జరిగిందని తెలియజేశారు ఈ సందర్భంగా మోహన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చల్లగా ఉండాలని ఆ రేణుక ఎల్లమ్మ తల్లి దీవెనలు రాష్ట్ర ప్రభుత్వంపై ఉండాలని ఆయన అర్చనలు అభిషేకాలు చేయించారు అనంతరం ఆలయ పూజారి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ కార్యక్రమంలో సిద్ధవటం సింగల్ విండో అధ్యక్షులు దారపునేని దశరథ రామానాయుడు, శ్రీ నిత్య పూజ దేవస్థానం చైర్మన్ జంగిటి రాజేంద్రప్రసాద్ యాదవ్, రాష్ట్ర బీసీ సెల్ కార్యనిర్వాహణ కార్యదర్శి, కాడే శ్రీనివాసులు నాయుడు, టిడిపి యువ నాయకులు, తుర్ర ప్రతాప్ నాయుడు, తదితరులు పాల్గొన్నారు

