సిద్ధవటం , ప్రజా సీమ
ఇరుగులమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు వైభవంగా జరిగాయి సిద్ధవటం మండలంలో మూలపల్లి క్రాస్ వద్ద వెలసిన శ్రీ ఇరుగులమ్మ అమ్మవారికి ఆదివారం, కుంకుమార్చన, అభిషేకాలు వంటి పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ పూజారి రమణయ్య మాట్లాడుతూ సిద్ధవటం బ్రాహ్మణ వీధి నివాసులు సీనియర్ పాత్రికేయులు బొమ్ము చిన్న వెంకటసుబ్బయ్య సుగుణ దంపతులు మరియు కుటుంబ సభ్యులు అమ్మవారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ కార్యక్రమంలో మూలపల్లి, సిద్ధవటం, రాజంపేట కడప పలు గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

