ePaper
Thursday, July 16, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్పవన్ కళ్యాణ్ కు అండగా బలిజ సేన; యర్రం శెట్టి మస్తాన్ రాయలు

పవన్ కళ్యాణ్ కు అండగా బలిజ సేన; యర్రం శెట్టి మస్తాన్ రాయలు

📰 Generate e-Paper Clip

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు అండగా బలిజ సేన ఉంటుందని రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళుతున్న జనసేన అధినేతకు ఎప్పటికీ మా మద్దతు ఉంటుందని యర్రం శెట్టి మస్తాన్ రాయలు తెలియజేశారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర ప్రజలందరికీ ఆయన సేవలు అవసరం ఆయనకు మద్దతుగా బలిజ సేన ఎప్పుడు అండగా ఉంటుందని బలిజ సేన రాష్ట్ర ఉపాధ్యక్షులు యర్రం శెట్టి మస్తాన్ రాయలు, వెల్లడించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళుతూ రాష్ట్ర ప్రజలందరూ తమకు సమానమైన అని ఉపముఖ్యమంత్రి ఒక వైపు చెబుతున్న ఆ మాటలను వక్రీకరించి తప్పుడు విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి మాట్లాడుతున్న వారికి ఏదో ఒక రోజు తెలిసొచ్చే విధంగా ప్రజలే బుద్ధి చెబుతారని. మంచి విధానాన్ని తీసుకొని రాష్ట్రాన్ని కులమతాలకు అతీతంగా అభివృద్ధి వైపు తీసుకు వెళుతున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కు రాష్ట్ర బలిజ సేన అండగా ఉంటుందని ఆయన వెంటే మా నడక ఉంటుందని వెల్లడించారు. గత ఐదు సంవత్సరాల క్రితం అభివృద్ధి అంటే ఏందో రాష్ట్ర ప్రజలు చూశారని కూటమిలో ఉంటూ కూటమి ధర్మాన్ని పాటిస్తూ ముందుకు వెళుతున్న పవన్ కళ్యాణ్ కు ఇలాంటివారు మాట్లాడేందుకు అర్హకులు కారన్నారు. ప్రతి మాటకు ఓ అర్థం ఉంటుందని మాట్లాడే విధానాన్ని ఆలోచించి మాట్లాడితే బాగుంటుందని అలా మాట్లాడే వారికే ఇలా సమాధానం చెబుతున్నామని ఆయన తెలియజేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఉన్న బలిజ కాపు ఒంటరి తెల్లగా మున్నూరు కాపు, ఉపకులాలన్నీ ఏకతాటిపై ఉన్నాయని ఎవరో ఏదో మాట్లాడుతున్నారని ప్రతి మాటను ఒక కులానికి పరిమితం చేసి పవన్ కళ్యాణ్ ను మాట్లాడడం సబబు కాదని తెలియజేశారు. రాష్ట్ర నాయకత్వంపవన్ కళ్యాణ్ వెంట నడుస్తుందని వెల్లడించారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!