ePaper
Monday, August 31, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తెల్లారక ముందే లబ్ధిదారులకు పింఛన్లు

తెల్లారక ముందే లబ్ధిదారులకు పింఛన్లు

📰 Generate e-Paper Clip

రాజంపేట రూరల్(ప్రజా సీమ)

రాజంపేట టిడిపి ఇంచార్జి చమర్తి జగన్మోహన్ రాజు ఆదేశానుసారం బుధవారం పేదలకు ఎన్టీఆర్ వితంతు, వికలాంగులు, పింఛన్ భరోసా కార్యక్రమంలో కొమ్మి వారి పల్లి అరుంధతి వాడ, గ్రామంలో టిడిపి నాయకులు సిద్ధారపు రామ్మోహన్  ఆధ్వర్యంలో పెన్షన్ కార్యక్రమం పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ మన సీఎం చంద్రబాబు నాయుడు మరియు ఎడ్యుకేషన్ ఐటి మినిస్టర్ లోకేష్  దేశంలో ఎక్కడా లేనివిధంగా, మన ఆంధ్రప్రదేశ్ లో వికలాంగులకు 6000, వితంతువులకు 4000, డయాలసిస్ పేషెంట్లకు 10000 గర్వకారణం. రాష్ట్రంలో CBNగారు, లోకేష్ గారు రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు పరుగులు పెట్టిస్తుంటే, మన రాజంపేట ఇంచార్జి చమ్మర్థి జగన్మోహన్ రాజు  నిరంతరం విరామం లేకుండా. నియోజకవర్గంలో పర్యటిస్తూ, అలాగే మున్సిపాలిటీలో డోర్ టు డోర్ కార్యక్రమంలో ప్రజల కష్టాలను తీరుస్తూ. రాజంపేట అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు సిద్ధారపు రామ్మోహన్, మరియు టిడిపి కార్యకర్తలు సిద్ధార్థ సుబ్బయ్య, గొంటు మహేంద్ర, సచివాలయ సిబ్బంది, విఆర్ఓ హరి గారు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!