ePaper
Monday, August 10, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్సాఫ్ట్ బాల్ క్రీడాకారుల భవిష్యత్తుకి పునాది వేద్దాం: ఇండియా సెక్రెటరీ ప్రవీణ్ అనౌకర్

సాఫ్ట్ బాల్ క్రీడాకారుల భవిష్యత్తుకి పునాది వేద్దాం: ఇండియా సెక్రెటరీ ప్రవీణ్ అనౌకర్

📰 Generate e-Paper Clip

శ్రీకాకుళం:

సాఫ్ట్ బాల్ అభివృద్ధికి క్రీడాకారుల భవిష్యత్తుకి మంచి పునాది వేయాలని, అందులో భాగంగా అఫీషియల్స్ (అంపైర్లు) పాత్ర కూడా కీలకంగా ఉంటుందని ఇండియన్ సాఫ్ట్బాల్ అసోసియేషన్ సెక్రెటరీ ప్రవీణ్ అనౌకర్ తెలియజేశారు. శనివారం శ్రీకాకుళం పట్టణం క్రిస్టల్ ప్యాలస్ నందు ఏపీ సాప్ట్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏపీ సెక్రటరీ సూర శ్రీనివాసరావు అధ్యక్షతన ఏపీ సాప్ట్ బాల్ అసోసియేషన్ సెమినార్ తో పాటు అఫీషియల్స్ క్లినిక్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అఫీషియల్ క్లినిక్ ను మొదలు పెడుతూ క్రీడలలో అసలైన సమర్థవంతమైన క్రీడాకారులు ముందుకు రావాలన్నా, టోర్నమెంట్లలో ఎటువంటి అవకతవకులు లేకుండా స్వచ్ఛమైన నిర్ణయాలు తీసుకోవాలన్న అంపైర్ల పాత్ర కీలకమని, అందరికీ నిబంధనలు తెలిసినా సరికొత్తగా మరోసారి సాఫ్ట్ బాల్ అభివృద్ధి కోసం, భవిష్యత్తులో జరిగే టోర్నమెంట్లలో అంపైర్లు తీసుకోవలసిన జాగ్రత్తల పై, రూల్ బుక్ తో పాటు అందిస్తున్నామని, కావున ఈ అఫీషియల్ క్లినిక్ ద్వారా మరింతగా నాణ్యమైన నిర్ణయాలతో సాఫ్ట్ బాల్ భవిష్యత్తులో మరింత గొప్పగా ఎదిగేందుకు ప్రతి ఒక్కరు తమ వంతు సహకారం అందించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ రెఫరీ చీఫ్ దేశ్ పాండే, ఏపీ టెక్నికల్ అఫీషియల్స్ కన్వీనర్ జగదీశ్వర్ రెడ్డి, ఏపీ కన్వీనర్ ఎంవి రమణ, ట్రెజరర్ సామంత రెడ్డి, కడప జిల్లా సెక్రెటరీ రామసుబ్బారెడ్డి తో పాటు వివిధ జిల్లాల నుండి వచ్చిన అఫీషియల్స్ పాల్గొనడం జరిగింది.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!