ePaper
Sunday, August 30, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్బహుజన సమాజ్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా బుచ్చి గారి కిరణ్

బహుజన సమాజ్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా బుచ్చి గారి కిరణ్

📰 Generate e-Paper Clip

 

విజయవాడ:(ప్రజా సీమ)

బహుజన సమాజ్ పార్టీ (BSP) NTR జిల్లా, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి చెందిన బుచ్చగారి కిరణ్‌ను NTR జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమించారు.

ఈ మేరకు బహుజన సమాజ్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు బండెల గౌతమ్ కుమార్ అధికారికంగా నియామక ఉత్తర్వులు జారీ చేశారు. పార్టీ అధిష్ఠానం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, బహుజన సమాజ్ పార్టీ సిద్ధాంతాలు మరియు ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని బుచ్చగారి కిరణ్ తెలిపారు.

పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ, బహుజన వర్గాల హక్కులు, సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తానని ఆయన పేర్కొన్నారు. తనకు ఈ బాధ్యత అప్పగించిన రాష్ట్ర నాయకత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!