ePaper
Sunday, August 30, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper

📰 Generate e-Paper Clip

ఓపెన్ డ్రింకింగ్, కోడి పందేల ప్రాంతాలపై డ్రోన్ కెమెరాలతో నిఘ

రైల్వేlకోడూరు ప్రజాసేవ

రైల్వే కోడూరు: బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, కోడి పందేలు నిర్వహించడం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలను అరికట్టేందుకు రైల్వే కోడూరు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.ఇందులో భాగంగా గతంలో బహిరంగంగా మద్యం సేవించే ప్రదేశాలు, కోడి పందేలు నిర్వహించే అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించి, ఆయా ప్రాంతాలపై డ్రోన్ కెమెరాల ద్వారా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలు, గుంపులుగా చేరడం, అక్రమ మద్యం సేవించడం, కోడి పందేల నిర్వహణ వంటి కార్యకలాపాలను డ్రోన్ ద్వారా పర్యవేక్షిస్తున్నారు.బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, కోడి పందేలు నిర్వహించడం లేదా వాటికి సహకరించడం చట్టపరంగా నేరమని పోలీసులు హెచ్చరించారు. ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.ప్రజలు కూడా ఇలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాల గురించి సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేసి, శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించాలని పోలీసులు కోరారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!