సిద్ధవటం:
సిద్ధవటం మండల మాజీ ఎంపీపీ మాచుపల్లి యూనిట్ కన్వీనర్ రామిరెడ్డి నరసింహారెడ్డి వారి కుమారుడు ఇటీవల నూతనంగా సివిల్ అసిస్టెంట్ సర్జన్ గా ఎన్నికయి బుధవారం ఉదయం కురుపాం నియోజకవర్గంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కురుపాం నియోజకవర్గ ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ జగదీశ్వరి ని వారి స్వగృహంలో వారి పుట్టినరోజు సందర్భంగా మర్యాదపూర్వకంగా కలిసి మాచుపల్లి టిడిపి సీనియర్ నాయకులు పిచ్చి రెడ్డి, టిడిపి యువ నాయకుడు భరత్ సింహారెడ్డి, నూతన సివిల్ సర్జన్ లక్ష్మీ నరసింహారెడ్డి,తదితర టిడిపి నాయకులతో వెళ్లి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

