ePaper
Sunday, August 30, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్బి ఎల్ ఓ లు 100 శాతం ఎస్ఐ ఆర్ మ్యాపింగ్ పూర్తి పూర్తి చేయాలి;...

బి ఎల్ ఓ లు 100 శాతం ఎస్ఐ ఆర్ మ్యాపింగ్ పూర్తి పూర్తి చేయాలి; డిఆర్ఓ మల్లికార్జునుడు

📰 Generate e-Paper Clip

 

సిద్దవటం ప్రజా సీమ

బిఎల్ఓ లు 100 శాతం ఎస్ఐఆర్ మ్యాపింగ్ పూర్తి చేయాలని కడప డిఆర్ఓ మల్లికార్జునుడు ఆదేశించారు. సిద్దవటం మండలంలోని పెద్దపల్లి గ్రామపంచాయతీ భాకరాపేట స్వర్ణ సచివాలయంలో బుధవారం బిఎల్ఓ లు చేస్తున్న ఎస్ఐఆర్ ప్రక్రియను పరిశీలించిన డిఆర్ఓ వారికి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ బిఎల్ఓ లకు ఎన్యుమరేషన్ ఫారం లను డిజిటలైజేషన్ చేసేందుకు సహాయంగా అంగన్వాడీ కార్యకర్తలు, ఎస్.హెచ్.జి విఓఏ లను నియమించడం జరిగిందన్నారు. డబుల్ ఎంట్రీలు, చనిపోయిన, వలసదారుల ఓట్లను తొలగించి మిగిలిన ఒటర్ల మ్యాపింగ్ చేసి డిజిటలైజేషన్ ను జులై 14 లోగా పూర్తి చేయాలన్నారు. ఈ నెల 12వ తేదీన ఎస్ఐఆర్ ను తనిఖీ చేసేందుకు మరోసారి వస్తానని అప్పటిలోగా బిఎల్ఓ లకు నిర్దేశించిన లక్ష్యాన్ని త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిద్ధవటం తహసీల్దార్ విజయ్ కుమార్, బిఎల్ఓ లు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!