నందలూరు (ప్రజా సీమ)
బీసీ అంటే బ్యాక్ వర్డ్ క్యాస్ట్ కాదని, బీసీ అంటే బ్యాక్ బోన్ క్యాస్ట్ అని, అలాంటి క్యాస్ట్ కు ఎల్లప్పుడూ అండదండలు అందించే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని, ముఖ్యంగా బీసీ బిడ్డల విద్యకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని రాజంపేట నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు తెలియజేశారు. బుధవారం నందలూరు మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిరావు పూలే బీసీ మహిళ వెల్ఫేర్ పాఠశాలలో జరిగిన కార్యక్రమం కు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేస్తుందని, విద్యాశాఖ మంత్రిగా భవిష్యత్ తరాలకు వారధిగా నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్నారని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ప్రభుత్వ పాఠశాల కొత్త రూపం సంతరించుకుందని, ప్రతి ఒక్కరూ బాగా చదివి ప్రభుత్వానికి పాఠశాలలకు మంచి పేరు తీసుకురావాలని ఆయన తెలియజేశారు. పాఠశాలలకు కావాల్సిన సహాయ సహకారాలు అందించడంలో తాము ఎల్లప్పుడూ ముందుంటామని, ప్రభుత్వ ఆకాంక్షలకు అనుగుణంగా ప్రతి విద్యార్థి గొప్ప స్థాయికి ఎదిగేలా పాఠశాల యాజమాన్యం ముందుండి నడిపించాలని, ప్రతి బీసీ బిడ్డ అత్యున్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. అనంతరం ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు క్రీడా దుస్తుల పంపిణీ తో పాటు, ఇటీవల రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరిచిన వారికి అభినందనలు తెలియజేశారు.

