ePaper
Sunday, August 30, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన పుల్లంపేట ఆణిముత్యం పిడికిటి దివ్యశ్రీ

ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన పుల్లంపేట ఆణిముత్యం పిడికిటి దివ్యశ్రీ

📰 Generate e-Paper Clip

పుల్లంపేట (ప్రజా సీమ)

బుధవారం విడుదలైన ఇంటర్ ఫలితాలలో పుల్లంపేట కి చెందిన పిడికిటి సుధాకర్ కుమార్తె పుల్లంపేట ఆణిముత్యంపిడికిట దివ్యశ్రీ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం 470 మార్చుకు 466 సాధించి తిరుపతి అశ్వమేధ జూనియర్ కాలేజ్ ఫస్ట్, తిరుపతి సిటీకే ఫస్ట్ గా నిలిచి సత్తా చాటింది. ఈ మేరకు ఆమె తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తూ ఇందుకు సహకరించిన కాలేజీ యాజమాన్యానికి, అధ్యాపక బృందానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని, భవిష్యత్తులో కూడా మంచి మార్కులు సాధించి అటు పుల్లంపేట తో పాటు అందరికీ మంచి పేరు తీసుకువచ్చేలా ప్రోత్సహిస్తామని వారు తెలియజేశారు. ఈ సందర్భంగా దివ్యశ్రీ మాట్లాడుతూ తనకు అన్ని విధాల అండగా నిలిచిన తల్లిదండ్రులకు , అధ్యాపకులకు, కాలేజీ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని భవిష్యత్తులో మరింతగా కష్టపడి మంచి పేరు తీసుకువచ్చేలా ముందుకు వెళ్తానని తెలియజేశారు. పిడికిడి దివ్యశ్రీ మంచి మార్కులతో సత్తా చాటడం పట్ల పుల్లంపేట వాసులు పలువురు అభినందనలు తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!