ePaper
Saturday, October 17, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఎడిటోరియల్అనంతరాజుపేటలో ప్రత్యేక కంటి వైద్య శిబిరం

అనంతరాజుపేటలో ప్రత్యేక కంటి వైద్య శిబిరం

📰 Generate e-Paper Clip

అనంతరాజుపేటలో ప్రత్యేక కంటి వైద్య శిబిరం

రైల్వేకోడూరు ప్రజా సీమ

రైల్వేకోడూరు: అంతర్జాతీయ గ్రామీణ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని అనంతరాజుపేట గ్రామ పంచాయతీ పెద్దలు, మరియు బండారు మల్లికార్జున గారి ఆధ్వర్యంలో American Lasers Eye Hospital, Tirupati సహకారంతో అక్టోబర్ 15న ప్రత్యేక కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నారు. అనంతరాజుపేట గ్రామ పంచాయతీ సమీపంలోని హెల్త్ సెంటర్‌లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ఈ శిబిరం జరుగుతుంది. అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్, మార్కెటింగ్ మేనేజర్ వసంత్ జేష్టాది గారు మాట్లాడుతూ కంటి చూపు, కంటి పవర్, కాటరాక్ట్, పేటరీజియం, రెటినా సంబంధిత ప్రాథమిక పరీక్షలతో పాటు వైద్యుల సలహాలు, తదుపరి చికిత్సకు మార్గదర్శకత్వం అందించనున్నారు. కంటి వైద్య సేవలు, అత్యాధునిక పరీక్షా పరికరాలు, అవసరాన్ని బట్టి లేజర్ చికిత్సా సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి అర్హతను బట్టి ఆరోగ్యశ్రీ, ఆరోగ్య బీమా పథకాల ద్వారా అందుబాటులో ఉన్న సేవలపై కూడా మార్గదర్శకత్వం అందిస్తారని పేర్కొన్నారు.ఈ సందర్భంగా బండారు మల్లికార్జున  మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో కంటి ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడం, ముఖ్యంగా మహిళలు కంటి సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా తగిన సమయంలో పరీక్షలు చేయించుకునేలా ప్రోత్సహించడం ఈ శిబిరం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. కోడూరు మండలం, అనంతరాజుపేటతో పాటు పరిసర గ్రామాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!