ePaper
Friday, October 9, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్బీసీకి అవకాశం ఇస్తే టిడిపి విజయం తథ్యం

బీసీకి అవకాశం ఇస్తే టిడిపి విజయం తథ్యం

📰 Generate e-Paper Clip

బీసీ అభ్యర్థిగా తప్పనిసరిగా విజయం సాధిస్తా,,,

రాజంపేట మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా అవకాశం కల్పించాలి

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌కు దొంతం శివ ప్రసాద్ వినతి

అమరావతి (ప్రజాసీమ)

తనకు రాజంపేట మున్సిపల్ అభ్యర్థిగా అవకాశం కల్పిస్తే తప్పనిసరిగా విజయం సాధించి తెలుగుదేశం జెండా ఎగరవేస్తానని టిడిపి రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి దొంతం శివప్రసాద్ రాష్ట్ర టిడిపి అధ్యక్షున్ని కోరారు. బుధవారం
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ని రాజంపేట పార్లమెంటు టీడీపీ అధికార ప్రతినిధి దొంతం శివ ప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా రాబోయే రాజంపేట మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ తరఫున మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా తనకు అవకాశం కల్పించాలని పల్లా శ్రీనివాస్ ని దొంతం శివ ప్రసాద్ కోరారు.
తాను బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తినని, పార్టీ కోసం ఎంతోకాలంగా పనిచేస్తూ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతున్నానని రాష్ట్ర అధ్యక్షుడి దృష్టికి తీసుకెళ్లారు. బీసీ వర్గాలకు రాజకీయంగా మరింత ప్రాధాన్యత కల్పించే విధంగా తనకు ఈ అవకాశం ఇవ్వాలని కోరారు.
ఈ సందర్భంగా పల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ బీసీలకు ఎప్పుడూ పెద్దపీట వేస్తుందని, బీసీల రాజకీయ సాధికారతకు పార్టీ కట్టుబడి పనిచేస్తుందని తెలిపారు. పార్టీ అధిష్ఠానం అన్ని అంశాలను పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు.
రాజంపేట నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి జగన్మోహన్ రాజు నాయకత్వంలో రాజంపేట మున్సిపాలిటీ ఇప్పటికే అభివృద్ధి పథంలో ముందుకు పోతున్న నేపధ్యంలో తనకు చైర్మన్ అవకాశం కల్పిస్తే ఇంచార్జి ఆధ్వర్యంలో మరింత అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తానని దొంతం శివ ప్రసాద్ తెలిపారు. తన అభ్యర్థిత్వాన్ని పార్టీ అధిష్ఠానం సానుకూలంగా పరిశీలిస్తుందనే నమ్మకం ఉందని ఆయన పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!