ePaper
Saturday, October 10, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఎడిటోరియల్జనసేన సేవక్ దళ్ కమిటీ సభ్యుడిగా ముద్దపోలు సభాపతికి సన్మానం

జనసేన సేవక్ దళ్ కమిటీ సభ్యుడిగా ముద్దపోలు సభాపతికి సన్మానం

📰 Generate e-Paper Clip

జనసేన సేవక్ దళ్ కమిటీ సభ్యుడిగా ముద్దపోలు సభాపతికి సన్మానం

రైల్వేకోడూరు ప్రజాసీమ

జనసేన పార్టీ సమన్వయ కమిటీ ‘సేవక్ దళ్’ విభాగంలో సభ్యునిగా నియమితులైన ముద్దపోలు సభాపతికి ఆయన అభిమానులు, జనసేన పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు ఘనంగా సన్మానం చేశారు. సభాపతి సేవక్ దళ్ సభ్యుడిగా ఎంపిక కావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ తిరుపతి జిల్లా రైల్వే కోడూరు లోని ఆయన నివాసం వద్ద శాలువాలు కప్పి, పుష్పగుచ్ఛాలు అందించి శ్రేయోభిలాషులు తమ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ, పార్టీ పట్ల ముద్దపోలు సభాపతికి ఉన్న నిబద్ధత, సేవాభావాన్ని గుర్తించి పార్టీ అధిష్టానం ఆయనకు ఈ బాధ్యతలను అప్పగించిందని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో సేవక్ దళ్ ద్వారా పార్టీ బలోపేతానికి, ప్రజోపయోగ కార్యక్రమాలకు సభాపతి మరింత కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
తదనంతరం, ముద్దపోలు సభాపతి మాట్లాడుతూ  తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన జనసేన అధిష్టానానికి, సన్మానించిన నాయకులకు, అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. జనసేన సిద్ధాంతాలకు అనుగుణంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ, పార్టీ అభివృద్ధి కోసం శక్తివంచన లేకుండా శ్రమిస్తానని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ముఖ్య నాయకులు ఖాజా మొహిదీన్, గజ్జల శివకుమార్, బాలిశెట్టి హరి, గల్లా శివకుమార్, నానాభాల గిరిప్రసాద్ మరియు కార్యకర్తలు, అభిమానులు మరియు స్థానిక ప్రముఖులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!