ePaper
Friday, June 12, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భావితరాలకు స్ఫూర్తి;చమర్తి జగన్ మోహన్ రాజు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భావితరాలకు స్ఫూర్తి;చమర్తి జగన్ మోహన్ రాజు

📰 Generate e-Paper Clip

రాజంపేట(ప్రజా సీమ).

ప్రజల హక్కులకోసం అంబేద్కర్ చేసిన పోరాటం ప్రపంచానికే ఆదర్శమని,వారి ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు  పేర్కొన్నారు. మంగళవారం నాడు రాజంపేట పట్టణం నందు పర్యటిస్తూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135 వ జయంతి సందర్భంగా స్థానిక ఎన్టీఆర్ సర్కిల్, ఆర్ అండ్ బి అతిథి గృహం అంబేద్కర్ వద్దనున్న విగ్రహాలకు ఘనంగా నివాళులు  చమర్తి జగన్ మోహన్ రాజు  అర్పించారు. ఈ సందర్భంగా చమర్తి మాట్లాడుతూ అణగారిన వర్గాల సంక్షేమం కోసం అంబేద్కర్ చేసిన కృషిని కొనియాడారు,బడుగు బలహీన వర్గాలు,మహిళా సాధికారతకు అంబేద్కర్ కృషి చేశారని తెలియజేశారు. అంతేకాకుండా ఆయన మాట్లాడుతూ దూరదృష్టితో దేశ భవిష్యత్తును ఊహించి,దార్శనికతతో రాజ్యాంగాన్ని రూపొందించిన అంబేద్కర్ భావితరాలకు స్ఫూర్తిగా నిలిచారని చమర్తి స్మరించుకున్నారు. అంబేద్కర్ స్ఫూర్తితో నేటి యువత ముందుకెళ్లాలని,వారి ఆశయ సాధనకు కృషి చేయాలని, దేశానికే కుల మత భేదం లేకుండా ప్రతి ఒక్కరూ సమానమేనని దిశా నిర్దేశం చేసిన గొప్ప వ్యక్తి బిఆర్ అంబేద్కర్ అని చమర్తి అన్నారు.గ్రామాల్లో కూడా కుల మత బేధాలు లేకుండా అందరూ సమానమే అనే నినానని తీసుకొచ్చారని ఈ సందర్భంగా చమర్తి తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!