ePaper
Friday, June 12, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్గ్రామాలలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి

గ్రామాలలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి

📰 Generate e-Paper Clip

గాలివీడు ఫిబ్రవరి 11 (ప్రజా సీమ): రాయచోటి నియోజకవర్గ వ్యాప్తంగా గ్రామాలలో మౌలిక సదుపాయాలు కల్పనకు కృషి చేస్తున్నట్లు రాయచోటి నియోజకవర్గ టిడిపి నాయకుడు డాక్టర్ మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన బుధవారం గాలి వీడు మండలంలోని కుమ్మరపల్లి నుంచి బలిజబెల్లి వరకు ఏర్పాటు చేస్తున్న సిమెంట్ రోడ్డును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఎడాది కాలంలోని ఐదు కోట్ల రూపాయలతో అన్ని గ్రామాలలో సిమెంట్ రోడ్లు డ్రైనేజీ విద్యుత్ దీపాలు వంటి మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. మంచినీటి అద్దడి నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. అనంతరం మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేయనున్న టిడిపి ఆఫీసును పరిశీలించారు.ఈ కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షులు కుమార్ రెడ్డి టిడిపి నాయకులు గీదర ధర్మారెడ్డి,శ్రీకాంత్, శివ, భాస్కర్ నాయుడు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!