రాజంపేట:
వైసిపి అబద్ధాల యూనివర్సిటీకి కొత్త ప్రొఫెసర్ గా శైలజనాథ్ తయారయ్యారని, రాజంపేటకు అతిథిగా వచ్చి అసత్యాలు బాగానే మాట్లాడుతున్నారని, ఇద్దరు భూ కబ్జాదారుల మధ్య కూర్చొని, అక్రమ నిర్మాణంలో బస చేస్తూ ప్రభుత్వంపై విమర్శలు చేయడం చూస్తుంటే ప్రజలు నవ్వుతున్నారని రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమకు ఎవరు న్యాయం చేశారు ఎవరు అన్యాయం చేశారు అనేది అనంతపురం జిల్లా ప్రజలను అడిగితే తెలుస్తుందని, కొత్తగా వైసీపీ పర్టీలో చేరడం వలన శైలజ నాథ్ కు కళ్ళు కనిపించడం మానేశాయేమోనని, చట్ట విరుద్ధంగా వ్యవహరించి రాయలసీమ ఇరిగేషన్ పనులను ముందుకు పోకుండా చట్టపరంగా చిక్కులు తెచ్చి పెట్టిన ఘనత వైసిపి పార్టీదని, రాజంపేట నియోజకవర్గంలో ఏకంగా అన్నమయ్య డ్యాము ను పొట్టన పెట్టుకోవడమే కాకుండా, వేల ఎకరాలు భూములు కాజేసిన ఘనత ఆకేపాటి కుటుంబానికి చెందుతుందని, మరి అలాంటి ఆకేపాటి సోదరులను పక్కన పెట్టుకొని మీరు అవినీతి గురించి మాట్లాడటం చూస్తుంటే అవినీతి అక్రమార్కుల పార్టీలో చేరిన సరికొత్త అబద్దాల ప్రొఫెసర్ గా శైలజ నిలిచిపోతారని, ముందు రాజంపేట ఏ జిల్లాలో ఉందో తెలుసుకొని, ఇక్కడ ప్రజలు పడుతున్న ఇబ్బందులు ఎవరివల్ల వస్తున్నాయో తెలుసుకొని, ఇక్కడ భూములను ఎవరు దోచుకుంటున్నారో తెలుసుకొని మాట్లాడాలని, కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తికి రాజంపేట నియోజకవర్గం పై కనీస అవగాహన లేక ఆకేపాటి స్క్రిప్ట్ చదవడం చూస్తుంటే వైసీపీ పార్టీలో చేరడంతోనే అబద్దాలకు బ్రాండ్ అంబాసిడర్ గా మారుతారేమో అని అనిపిస్తుందని, రాయలసీమను రాయల్ సీమగా మార్చేది ఒక్క కూటమి ప్రభుత్వమేనని, శైలజనాథ్ సొంత జిల్లా అయిన అనంతపురంలో నిరుద్యోగులను అడిగితే స్పష్టమైన జవాబు చెబుతారని, అతి త్వరలోనే ఆకేపాటి అవినీతితోపాటు వైయస్సార్సీపి భాగవతం కూడా పూర్తిగా బట్టబయలు అవుతుందని ఆయన తెలియజేశారు. రాయలసీమ ద్రోహిగా వైసీపీ పార్టీ నిలిచిపోతుందని, రాయలసీమ అభివృద్ధి విషయంలో ఎవరితోనైనా ఎప్పుడైనా బహిరంగ చర్చించేందుకు సిద్ధమని ఆయన సవాల్ విసిరారు.

