హైకోర్టు స్టేటస్ కో ఉత్తర్వులను బేఖాతరు చేస్తున్న ఒబులవారిపల్లి పోలీస్ స్టేషన్ – గోబ్బూరువారిపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలనీ బాధితుల డిమాండ్ చేస్తున్నారు.ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, అమరావతి W.P. No.18069 of 2026లో సంబంధిత ఆస్తికి సంబంధించి తదుపరి విచారణ తేదీ వరకు యథాతథ స్థితి (Status Quo) కొనసాగించాలని సంబంధిత అధికారులను ఆదేశించింది.అయితే, హైకోర్టు ఉత్తర్వులు అమలులో ఉన్నప్పటికీ, ఒబులవారిపల్లి పోలీస్ స్టేషన్ పోలీసులు మరియు గోబ్బూరువారిపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి హైకోర్టు జారీ చేసిన స్టేటస్ కో ఉత్తర్వులను సమర్థవంతంగా అమలు చేయడంలో విఫలమవుతున్నారని, ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని కొందరు అనధికార ప్రతివాదులు వివాదాస్పద స్థలంలో చట్టవిరుద్ధ మరియు ఇతర కార్యకలాపాలకు పాల్పడుతున్నారని పిటిషనర్ ఆరోపిస్తున్నారు. హైకోర్టు ఉత్తర్వులను తక్షణమే అమలు చేసి, చట్టవిరుద్ధ చర్యలను నిలువరించాలని పిటిషనర్ కోరుతున్నారు.హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయడం ప్రతి ప్రభుత్వ అధికారి రాజ్యాంగబద్ధమైన విధి. న్యాయస్థానం జారీ చేసిన ఆదేశాలను నిర్లక్ష్యం చేయడం న్యాయవ్యవస్థ గౌరవాన్ని దెబ్బతీసే చర్యగా పరిగణించబడుతుంది.కాబట్టి, పిటిషనర్ తరఫున రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా కలెక్టర్, జిల్లా పోలీసు అధికారి మరియు సంబంధిత ఉన్నతాధికారులు వెంటనే జోక్యం చేసుకుని హైకోర్టు స్టేటస్ కో ఉత్తర్వులను కచ్చితంగా అమలు చేయాలని, చట్టవిరుద్ధ కార్యకలాపాలను అడ్డుకొని, విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శించిన సంబంధిత అధికారులపై శాఖాపరమైన మరియు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
- Advertisment -ads

