ePaper
Saturday, October 17, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఎడిటోరియల్అంతర్జాతీయ సాఫ్ట్బాల్ పోటీలకు మంగపేట క్రీడాకారినీ సిద్ధం

అంతర్జాతీయ సాఫ్ట్బాల్ పోటీలకు మంగపేట క్రీడాకారినీ సిద్ధం

📰 Generate e-Paper Clip

అంతర్జాతీయ సాఫ్ట్బాల్ పోటీలకు మంగపేట క్రీడాకారినీ సిద్ధం

రైల్వేకోడూరు ప్రజాసీమ

తిరుపతి జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గం ఓబులవారిపల్లి మండలం మంగంపేట నివాసి అంతర్జాతీయ సాఫ్ట్ బాల్ లో పాల్గొనే భారత మహిళా జట్ల ఎంపిక, శిక్షణ కోసం ప్రత్యేక శిబిరాన్ని నిర్వహించనున్నట్లు భారత సాఫ్ట్బాల్ సమాఖ్య ప్రకటించింది. మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లా కోపర్గావ్లోని సంజీవని విద్యాసంస్థల ప్రాంగణంలో సెప్టెంబర్ 8 నుంచి 13 వరకు శిక్షణ శిబిరం జరగనుంది. చైనాలో అక్టోబర్ 12 నుంచి 18 వరకు జరిగే అండర్-15 మహిళల ఆసియా కప్ తో పాటు, చైనీస్ తైపీలో అక్టోబర్ 12 నుంచి 17 వరకు జరిగే ఆసియా విశ్వవిద్యాలయాల మహిళల సాఫ్ట్బాల్ పోటీలను దృష్టిలో ఉంచుకుని ఈ శిక్షణ నిర్వహిస్తున్నారు. ఎంపికైన క్రీడాకారిణులు సెప్టెంబర్ 7లోగా శిబిరానికి చేరుకోవాలని సమాఖ్య సూచించింది. క్రీడాకారిణులు పాస్పోర్ట్, క్రీడా సామగ్రి, రాష్ట్ర సంఘం ధ్రువీకరించిన వివరాల పత్రాలను వెంట తెచ్చుకోవాలని పేర్కొంది. ప్రయాణం, వసతి, భోజన ఖర్చులకు ప్రభుత్వ నిధులు అందుబాటులో లేనందున ఒక్కో క్రీడాకారిణికి సుమారు రూ.1.70 లక్షల వరకు ఖర్చు అవుతుందని సమాఖ్య తెలిపింది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపికైన క్రీడాకారిణులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించింది.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!