ePaper
Wednesday, September 2, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఎడిటోరియల్బుడుగుంటపల్లిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ముక్క రూపానందరెడ్డి 

బుడుగుంటపల్లిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ముక్క రూపానందరెడ్డి 

📰 Generate e-Paper Clip

బుడుగుంటపల్లిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ముక్క రూపానందరెడ్డి

రైల్వేకోడూరు ప్రజా సీమ

రైల్వేకోడూరు మండలం బుడుగుంటపల్లిలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైల్వేకోడూరు నియోజకవర్గం టీడీపీ పార్టీ ఇంచార్జ్, ముక్కా రూపానంద రెడ్డి , రైల్వే కోడూరు శాసనసభ్యులు అరవ శ్రీధర్ పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు.

 

ముక్కా రూపానంద రెడ్డి గ మాట్లాడుతూ , పేదలు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఇతర అర్హులైన లబ్ధిదారులకు ఆర్థిక భరోసా కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ద్వారా లబ్ధిదారులకు ప్రతి నెలా ఆర్థిక సహాయం అందిస్తూ వారి జీవనానికి ప్రభుత్వం అండగా నిలుస్తోందని పేర్కొన్నారు.ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తోందని తెలిపారు. నియోజకవర్గంలో అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరేలా కృషి చేస్తామని, ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, సంబంధిత అధికారులు,గ్రామస్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!