ePaper
Sunday, August 30, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్ఎన్టీఆర్ భరోసా పెన్షన్ దేశానికే ఆదర్శం: చమర్తి జగన్మోహన్ రాజు

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ దేశానికే ఆదర్శం: చమర్తి జగన్మోహన్ రాజు

📰 Generate e-Paper Clip

రాజంపేట(ప్రజాసీమ)

ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి చేరేలా కృషి చేస్తున్నామని నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు పేర్కొన్నారు.బుధవారం నాడు రాజంపేట మండలం కూచివారిపల్లె ఎన్టీఆర్ కాలనీ నందు పర్యటిస్తూ “పేదల సేవలో ఎన్టీఆర్ భరోసా”పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి ప్రభుత్వ అధికారులు/తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులతో కలిసి శ్రీ చమర్తి జగన్ మోహన్ రాజు  ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా చమర్తి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరిని ఆదుకుంటుందని జగన్ మోహన్ రాజు గారు తెలియజేశారు.అదేవిధంగా లబ్ధిదారులకు స్వయంగా పెన్షన్ అందజేసి వారి యోగక్షేమాలను చమర్తి అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా ప్రతి నెల సచివాలయ సిబ్బంది లబ్ధిదారుల ఇంటి వద్దకే వచ్చి పంపిణీ చేస్తున్నారా లేదా అంటూ జగన్ మోహన్ రాజు గారు ఆరా తీశారు.

 

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!