చిట్వేలి (ప్రజాసీమ)
భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఈరోజు చిట్వేల్ మండల తహసీల్దార్ కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ ఎం. రామమోహన్, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ యు. నిఖిల్ కుమార్ పాల్గొని డాక్టర్ అంబేద్కర్ దేశానికి చేసిన విశిష్ట సేవలను స్మరించుకున్నారు. సమానత్వం, సామాజిక న్యాయం, రాజ్యాంగ పరిరక్షణ కోసం ఆయన చేసిన కృషి ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని తెలిపారు.ఈ కార్యక్రమంలో రెవెన్యూ శాఖ సిబ్బంది, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ అంబేద్కర్ ఆశయాలను ప్రతి ప్రభుత్వ ఉద్యోగి తమ విధుల్లో ఆచరణలో పెట్టాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

