కడప ఫిబ్రవరి 11 (ప్రజాసీమక్రైమ్ రిపోర్టర్)ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణతో పాటు జిల్లాలో శాంతి భద్రతలను మరింత బలోపేతం చేయడమే ప్రధాన లక్ష్యంగా కడప జిల్లా ఎస్ పి షెల్కే నచికేత్ విశ్వనాథ్,ఆదేశాల మేరకు వై.ఎస్.ఆర్ కడప జిల్లా పోలీసులు జిల్లావ్యాప్తంగా విజిబుల్ పోలీసింగ్ కార్యక్రమాన్ని విస్తృ తంగా, కట్టుదిట్టంగా మరియు నిరంతరంగా అమలు చేస్తున్నారు. దీని ద్వారా నేరాలకు ముందస్తు నియంత్రణ సాధించడంతో పాటు ప్రజల్లో భద్రతా భావాన్ని మరింత పెంచేలా చర్యలు తీసుకుంటూ శాంతియుత వాతా వరణాన్ని నెలకొల్పు తున్నారు.జిల్లావ్యాప్తంగా అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలపై విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తూ, గంజాయి సహా నిషేధిత మత్తు పదార్థాల అక్రమ రవాణా, అసాంఘిక కార్యకలాపాలు, నేర ప్రవృత్తులు కలిగిన వ్యక్తులపై గట్టి నిఘా కొనసాగిస్తున్నారు. నేరాలకు తావులేని జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రత్యేక బృందాలతో నిరంతర తనిఖీలు, గస్తీలు చేపట్టి కఠిన చర్యలు తీసుకుంటున్నారు. రోజురోజుకు పెరుగుతున్న సైబర్ నేరాల నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని జిల్లా పోలీసులు సూచిస్తున్నారు. తెలియని లింకులు క్లిక్ చేయరాదని, ఓటీపీలు, బ్యాంక్ ఖాతా వివరాలు, పాస్‌వర్డులు, వ్యక్తిగత సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరితోనూ పంచుకోరాదని అవగాహన కార్యక్రమాల ద్వారా ప్రజలకు తెలియజే స్తున్నారు.సైబర్ మోసాల బారిన పడిన వెంటనే ఆలస్యం చేయకుండా పోలీసు లకు సమా చారం అందించాలని సూ చించారు.రహదారి ప్రమాదాలను నివారించడమే లక్ష్యంగా ట్రాఫిక్ నియమాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పిస్తున్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి, నాలుగు చక్రాల వాహనదారులు సీటు బెల్ట్ వినియోగించాలి. మైనర్ డ్రైవింగ్, సెల్‌ఫోన్ ఉపయోగిస్తూ వాహనం నడపడం, మద్యం సేవించి వాహనం నడపడం వంటి ప్రమాదకర చర్యలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే ఆటోలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకున్నా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.జిల్లాలో శాంతి భద్రతలు మరింత పటిష్టంగా కొనసాగా లంటే ప్రజల సహకారం అత్యంత అవసరమని జిల్లా పోలీసులు తెలిపారు.భద్రతకు సంబంధించిన ఏవైనా సమస్యలు లేదా అనుమానాస్పద కార్యకలాపాలు గమనించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు గానీ లేదా డయల్ *112* కు గానీ సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
జిల్లా వ్యాప్తంగా విజిబుల్ పోలీసింగ్
0
8

