ePaper
Tuesday, July 21, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper

📰 Generate e-Paper Clip

నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర రాజీనామా చేయాలి



రైల్వేకోడూరు మేజర్ న్యూస్

తిరుపతి జిల్లా రైల్వేకోడూరులో ఓ ప్రైవేటు విద్యాసంస్థలు విద్యార్థులతో సమావేశం సందర్భంగా మాట్లాడుతూ,

నీట్ పరీక్ష ప్రశ్నాపత్రం లీకేజీ దేశంలోని లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడిన అత్యంత తీవ్రమైన ఘటన దీనిని నిరసిస్తూ ప్రముఖ పర్యావరణ వేత్త , రామన్ మెగాసే అవార్డు గ్రహీత సామాజికవేత్త సోను వాంగ్ చుక్ తలపెట్టిన 20 రోజుల ఆమరణ నిరాహార దీక్ష కేంద్ర బిజెపి ప్రభుత్వం భగ్నం చేసి , పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరగాల్సిన జాతీయ స్థాయి పరీక్షలో జరిగిన ఈ అవకతవకలపై సమగ్ర దర్యాప్తు జరిపకుండా, కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ , బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోకుండా

ఈ అంశంపై న్యాయం కోరుతూ పార్లమెంట్ ముట్టడికి వెళ్లిన విద్యార్థులు, యువజనులు మరియు ప్రజాస్వామ్యవాదులపై పోలీసులు బలప్రయోగం చేయడం అత్యంత దురదృష్టకరం. ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ప్రతి పౌరునికి రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు. ఆ హక్కును అణచివేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం.

విద్యార్థుల భవిష్యత్తును రక్షించాల్సిన ప్రభుత్వాలు, వారి సమస్యలను వినకుండా నిరసనలను అణచివేయడం సరైన విధానం కాదు. కేంద్ర ప్రభుత్వం వెంటనే నీట్ ప్రశ్నాపత్రం లీకేజీపై పూర్తి నిజాలను దేశ ప్రజలకు వెల్లడించి, దోషులను శిక్షించాలన్నారు.అలాగే, నిరసన తెలిపిన విద్యార్థులు, యువజనులపై నమోదైన కేసులను ఉపసంహరించుకుని, పోలీసుల దాడిపై స్వతంత్ర విచారణ జరిపించాలి.

విద్యను కాపాడాలి – విద్యార్థుల భవిష్యత్తును రక్షించాలి – ప్రజాస్వామ్య హక్కులను గౌరవించాలి అనే డిమాండ్లతో విద్యార్థి, యువజన ఉద్యమాలకు మా పూర్తి సంఘీభావాన్ని తెలియజేస్తున్నాము.విద్య వ్యవస్థ ను కాపాడుదాం, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిద్దాం, బిజెపి లీకేజీ పాలనపై ప్రజా గళం వినిపిద్దాం. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల కన్వీనర్, వడ్డీ.జగన్ ,బాలాజీ, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!