ePaper
Monday, July 20, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఎడిటోరియల్షైనింగ్ ప్రతిభ అవార్డుల్లో మెరిసిన విజ్డమ్ విద్యార్థులు మహింధర్ మరియు జాహ్నవి కుమారి

షైనింగ్ ప్రతిభ అవార్డుల్లో మెరిసిన విజ్డమ్ విద్యార్థులు మహింధర్ మరియు జాహ్నవి కుమారి

📰 Generate e-Paper Clip

షైనింగ్ ప్రతిభ అవార్డుల్లో మెరిసిన విజ్డమ్ విద్యార్థులు మహింధర్ మరియు జాహ్నవి కుమారి

రైల్వేకోడూరు మేజర్ న్యూస్

రైల్వేకోడూరు పాతబజార్‌ విజ్డమ్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్’ విద్యార్థులు వై. మహింధర్ మరియు ఓ. జాహ్నవి కుమారి అద్భుత ప్రతిభ కనబరిచారు. ఇటీవల విడుదలైన SSC-2026 ఫలితాలలో మండల స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వీరు, తిరుపతి జిల్లా షైనింగ్ స్టార్ ప్రతిభ అవార్డు’కు ఎంపికయ్యారు.ఈ రోజు (జూలై 20వ తేదీన) తిరుపతిలోని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో వైభవంగా జరిగిన ఒక కార్యక్రమంలో వీరికి ఈ పురస్కారాలను అందజేశారు. జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ మరియు ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ చేతుల మీదుగా విద్యార్థులు మెరిట్ సర్టిఫికేట్, మెడల్ మరియు రూ. 20,000 (ఇరవై వేల రూపాయలు) నగదు బహుమతి చెక్కును అందుకున్నారని విజ్డమ్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ టి. ప్రదీప్ తెలియజేశారు.ఒంగోలు ఐ ఐ ఐ టి కి ఎంపిక:ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ, విజ్డమ్ పాఠశాల విద్యార్థి అయిన వై. మహింధర్ ప్రతిష్టాత్మక ఒంగోలు ఐ ఐ ఐ టి ట్రిపుల్ ఐటీ సీటుకు కూడా ఎంపికైనట్లు సంతోషం వ్యక్తం చేశారు.విద్యార్థులకు అభినందనలు:ఘన విజయం సాధించిన విద్యార్థులను విజ్డమ్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ టి. ప్రదీప్ , అడ్మిన్ డైరెక్టర్ టి. మదనమోహన్ , ప్రిన్సిపాల్ టి. ప్రియాంక మరియు అకడమిక్ ఇన్‌ఛార్జ్ పి. ముఖేష్ ప్రత్యేకంగా అభినందించారు. విద్యాసంస్థల యాజమాన్యం, ఉపాధ్యాయ బృందం పాల్గొని విద్యార్థుల భవిష్యత్తు మరింత ఉజ్వలంగా ఉండాలని ఆకాంక్షించారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!