కూటమి నాయకుల ఆక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది: మాజీ శాసనసభ్యులు కోరముట్ల శ్రీనివాసులు
రైల్వేకోడూరు న్యూస్
రైల్వే కోడూరు: ఈరోజు ఉదయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముందు పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ
రైల్వే కోడూరులో కూటమి నాయకుల అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోతుందని,కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుండి భూకబ్జాలు,ఇసుక ఆక్రమణలు భారీగా పెరిగిపోయాయని, నియోజకవర్గంలోని పుల్లంపేట,పెనగలూరు చిట్వేల్ మండలాల్లో ఇసుక మట్టి అక్రమంగా ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారని , గతంలో కోడూరు నుండి చిట్వేలుకు పోవాలంటే ఎంతో ఇబ్బందికరంగా ఉండేదని తను దృష్టిలో ఉంచుకొని గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హాల్లో 45 కోట్ల రూపాయలతో కోడూరు చిట్వేల్ డబుల్ రోడ్డు వైండింగ్ తో నూతన రోడ్డు నిర్మించామని దాని యొక్క కెపాసిటీ 20,25 టన్నులు మాత్రమే ఉండగా దానికి భిన్నంగా కూటమి నాయకుల అక్రమాలలో భాగంగా 70,80 టన్నుల బరువుతో అధిక లోడుతో అక్రమంగా ఇతర రాష్ట్రాలకు ఇసుకను తరలిస్తున్నారని విసిగిపోయిన గ్రామాల ప్రజలు నిన్నటి రోజున ఆ గ్రామాలలో సుమారు 30 లారీలను అడ్డుకోగా సంఘటన స్థలానికి వచ్చిన అధికారులు పోలీసులు బాధ్యులపై చర్యలు తీసుకోకుండా గ్రామస్తులకు సర్దు చెప్పి అక్కడినుండి టిప్పర్లను తీసుకెళ్లారని ఇది మంచి పరిణామం కాదు అని, ఇప్పటికైనా అధికారులు, కూటమి నాయకులు మాటలకు తలోగ్గకుండా, వారి అక్రమాలకు అడ్డుకట్ట వెయ్యాలని, లేనియెడల నియోజకవర్గ వ్యాప్తంగా, గ్రామ ప్రజలతో వైఎస్ఆర్సిపి కార్యకర్తలతో కలిసి, ఆయా ఇసుకక రీచ్ లలో, పర్యటించి భారీ ధర్నా నిర్వహిస్తామని *వైఎస్ఆర్సిపి రాష్ట్ర అధికార ప్రతినిధి& కోడూరు నియోజకవర్గ ఇన్చార్జ్& మాజీ శాసనసభ్యులు కోరముట్ల శ్రీనివాసులు గారు అన్నారు* అనంతరం ఇసుక టిప్పర్లు తిరుపతి వైపు వెళుతున్న అనే సమాచారం అందుకొని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పక్కన జాతీయ రహదారి పైకి వచ్చి టిప్పర్లను చూపిస్తూ పలు టిప్పర్లను అడ్డుకున్న *మాజీ శాసనసభ్యులు కోరముట్ల శ్రీనివాసులు.ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ సుబ్బరామరాజు,మాజీ సర్పంచ్ రామకృష్ణ,జిల్లా యువజన విభాగం అధ్యక్షులు శివారెడ్డి, జిల్లా యువజన విభాగం జనరల్ సెక్రెటరీ, గని (రాజా ) పట్టణ అధ్యక్షుడు సిహెచ్ రమేష్,సీనియర్ నాయకులు ఓబుల్ రెడ్డి, పర్వతం విజయ్ కుమార్ రెడ్డి, ఆర్యవైశ్య సంఘం మాజీ అధ్యక్షుడు గుణిశెట్టి రమేష్,ఎంపీటీసీలు జనార్దన్ రాజు, బండారు మల్లికార్జున, రౌఫ్, ఏడిక మహేష్,మైనారిటీ నాయకులు ముజీబ్, ఎక్స్ ఎంపీటీసీ బత్తిన ఆనందయ్య యాదవ్,కరిముల్లా,డీవీ రమణ, సిద్దయ్య, సుబ్రహ్మణ్యం రెడ్డి, తాడి రాజా, మనోహర యాదవ్, తదితరులు పాల్గొన్నారు

