ePaper
Saturday, May 30, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్గోపనపల్లి లో ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా కిట్‌ల పంపిణీ

గోపనపల్లి లో ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా కిట్‌ల పంపిణీ

📰 Generate e-Paper Clip

గాలివీడు మార్చి 16(ప్రజా సీమ విలేకరి)

ముస్లింల పవిత్ర పండగ రంజాన్ ను పురస్కరించుకునీ గాలివీడు మండలంలోని గోపసపల్లి గ్రామంలో సోమవారం గ్రామ టీడీపి నాయకుడు మిట్ట పల్లి వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో మంత్రి సోదరుడు డాక్టర్ మండి పల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి చేతులమీదుగా గ్రామంలోని పలు ముస్లిం మైనార్టీ కుటుంబాలకు, పేద హిందూ సోదరులకు కూడా నిత్యవసర సరుకులతో రంజాన్ తోఫా కిట్‌లను అందజేశారు. పేద హిందూ సోదరులకు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో పాటించే ఉపవాస దీక్షలు ఎంతో భక్తి శ్రద్ధలతో పాటిస్తారని, అల్లా ఆశీస్సులు ఎల్లప్పుడూ అందరికీ ఉండాలని కోరారు. ఈ పవిత్రమైన రంజాన్ మాసంలో చిన్నపిల్లల నుంచి మొదలుకుని వృద్ధుల వరకు కఠోర నియమాలతో ఉపవాస దీక్షలు చేయడం గొప్ప విషయం అన్నారు. రంజాన్ మాసంలో మత సామరస్యానికి ప్రతీక,,మత సామరస్య భావం పెంపొంది ప్రజల మధ్య ఐక్యత పెరుగుతుందన్నారు.
రంజాన్ మాసంలో ప్రతి ఒక్కరూ ఆరాధనలకు ప్రాధాన్యత ఇవ్వాలని, గ్రామ టీడీపి నాయకులు వెంకటరమణా రెడ్డి
వివిధ రకాల నిత్యావసర సరుకులతో కూడిన కిట్టును అందజేయడం శుభపరిణామం అన్నారు.. ముస్లిం సోదరులకు ముందస్తుగా రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలోమండల టీడీపి అధ్యక్షులు హేమ కుమార రెడ్డి ,మండల టీడీపి నాయకులు గీదర ధర్మారెడ్డి, సింగల్ విండో శ్రీనివాసులు రెడ్డి, డీలర్ శ్రీనివాసులు రెడ్డి,మురళీ మోహన్ నాయుడు, సూరి బాబు, శ్రీకాంత్,ఉదయ్,శేఖర్ రెడ్డి, కోటి రెడ్డి,
సుంకర రవీంద్రా బాబు,హాబీబుల్ల,అమీన్ పీర్, కే వీరారెడ్డి, ఎస్ ఖాదర్ వలీ , గోపన రెడ్డెప్ప నాయుడు, చిన్న రెద్దెప్ప నాయుడు ,ఖాజా పీర్,సవడయ్య, స్థానిక గ్రామ మండల టీడీపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!