ePaper
Saturday, May 30, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్భారతదేశంలో ప్రజాస్వామ్యం ఎక్కడుందో మీకు తెలుసా పుస్తకావిష్కరణ

భారతదేశంలో ప్రజాస్వామ్యం ఎక్కడుందో మీకు తెలుసా పుస్తకావిష్కరణ

📰 Generate e-Paper Clip

రాయచోటి మార్చి 4(ప్రజాసీమ విలేకరి) రాయచోటి అంబేద్కర్ సర్కిల్ దగ్గర డిగ్రీ కాలేజీ విశ్రాంత లెక్చరర్ నెల్లిపల్లి సిద్దయ్య రచించిన *భారతదేశంలో ప్రజాస్వామ్యం ఎక్కడుందో మీకు తెలుసా* అనే పుస్తకాన్ని బహుజన టీచర్స్ అసోసియేషన్ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు పల్లం రామచంద్ర రాష్ట్ర డిప్యూటీ సెక్రటరీ షేక్ అబ్దుల్ రజాక్, ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి రామాంజనేయులు లాయర్ రెడ్డెయ్య బీటీఏ అన్నమయ్య జిల్లా అసోసియేట్ అధ్యక్షులు ఏవీ రమణ, ట్రెజరర్ సీవీ రమణ, జిల్లా ఉపాధ్యక్షులు తేజ లతో కలిసి ఆవిష్కరించారు.ప్రజాస్వామిక భారతదేశంలో ఓటు హక్కు ద్వారా బహుజనులు ఏకమై ఏ విధంగా అధికారంలో భాగస్వామ్యం కావాలి వనరులలో వాటాను ఎలా పొందాలో ఈ పుస్తకంలో వివరించారని ప్రతి ఒక్కరూ ఈ పుస్తకాన్ని చదివి అవగాహనా పెంచుకోవాలన్నారు.ఈ కార్యక్రమం లో రఘు నాథ, శ్రీరాములు, సోనేనాయక్, మేకా రామచంద్ర తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!