ePaper
Friday, October 16, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్ప్రభుత్వ బడిలో చేర్పిద్దాం, మన ఊరిని కాపాడుకుందాం

ప్రభుత్వ బడిలో చేర్పిద్దాం, మన ఊరిని కాపాడుకుందాం

📰 Generate e-Paper Clip

వేంపల్లె నేటి పత్రిక ప్రజాసీమ:

ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రభుత్వ బడిలో చేర్పిద్దాం.. మన ఊరి బడిని కాపాడుకుందాం కార్యక్రమాన్ని నిర్వహించినట్లు యూటిఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు చెరుకూరు శ్రీనివాసులు అన్నారు. శనివారం స్థానిక చింతలమడుగుపల్లి గ్రామంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సంబంధిత కరపత్రాలు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యకు మొదటి ప్రాధాన్యత కల్పిస్తూ కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందన్నారు. దీనికి అణుగుణంగా యూటిఎఫ్ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ఎన్రోల్మెంట్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు, యూనిఫాం, తల్లికి వందనం తదితర పథకాలను ప్రభుత్వం అందిస్తున్నట్లు తెలిపారు. అలాగే డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం కింద నాణ్యమైన భోజన సౌకర్యం కల్పించినట్లు వివరించారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి, విద్యా సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో యూటిఎఫ్ నేతలు సుదర్శన్, ఫజ్లు, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!