ePaper
Wednesday, June 10, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్నకిలీ విలేఖర్లకు చెక్; ప్రెస్ స్టిక్కర్లను ఆవిష్కరించిన అన్నమయ్య జిల్లా ఎస్పీ

నకిలీ విలేఖర్లకు చెక్; ప్రెస్ స్టిక్కర్లను ఆవిష్కరించిన అన్నమయ్య జిల్లా ఎస్పీ

📰 Generate e-Paper Clip

మదనపల్లి,(ప్రజా సీమ)
నకిలీ విలేఖరుల అడ్డుకట్టకు జిల్లా పోలీస్ యంత్రాంగం సరికొత్త వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. జిల్లాలోని నిజమైన ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధుల అభ్యర్థన మేరకు, జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ క్యూఆర్ కోడ్ తో కూడిన ప్రత్యేక ‘ప్రెస్’ స్టిక్కర్లను సిద్ధం చేయించి, బుధవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ కీలక అంశాలను వెల్లడించారు. “జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ సమన్వయంతో ఈ ప్రెస్ స్టిక్కర్లను రూపొందించాం. స్టిక్కర్ పై విలేఖరి అక్రిడిటేషన్ నెంబర్, వాహన నెంబర్ స్పష్టంగా కనిపిస్తాయి. ఈ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయగానే సదరు ప్రతినిధి పేరు, సంస్థ, హోదా, చిరునామా మరియు కలెక్టర్ జారీ చేసిన అక్రిడిటేషన్ నెంబర్ స్పష్టంగా కనిపిస్తాయన్నారు.
ఈ స్టిక్కర్ల ద్వారా నిజమైన విలేఖరులెవరో, నకిలీలెవరో పోలీసులకు మరియు ప్రజలకు సులభంగా అర్థమవుతుందనీ,
మొదటి విడత అక్రిడిటేషన్లు ఉన్న వారికి స్టిక్కర్లు నేడు పంపిణీ చేశాం. రెండో విడతలో అక్రిడిటేషన్లు పొందనున్న మిగిలిన వారికి కూడా అందజేస్తామని స్పష్టం చేశారు.
పోలీసులకు అనుమానం వస్తే స్టిక్కర్ స్కాన్ చేసి వివరాలు సరిచూసుకుంటారు. ఎవరైనా నకిలీ క్యూఆర్ కోడ్ ఉపయోగిస్తున్నట్లు తేలితే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. పోలీస్ శాఖ అనుమతి లేకుండా ఇటువంటి స్టిక్కర్లను ఎవరైనా సొంతంగా ముద్రించినా లేదా విక్రయించినా వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం.
తమ సమస్యను గుర్తించి, త్వరితగతిన స్పందించి ఈ వినూత్న వ్యవస్థను తీసుకువచ్చినందుకు జిల్లా ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు ఎస్పీ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ నిర్ణయం వల్ల వృత్తిపరమైన విలువలు పెరుగుతాయని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ (పరిపాలన) యం. వెంకటాద్రి, ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!