రాజంపేట;(ప్రజా సీమ)
బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి, అంటరానితనాన్ని రూపుమాపడానికి కృషి చేసిన మహానుభావుడు, సామాజిక సంస్కర్త, మహిళా విద్యాభివృద్ధికి మార్గదర్శి, నిత్య స్ఫూర్తిప్రదాత మహాత్మా జ్యోతిరావు పూలే అని, ఆయన ఆశయాలను తూచా తప్పకుండా పాటించే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని రాజంపేట టిడిపి ఇన్చార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు తెలియజేశారు. శనివారం జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా రాజంపేట టౌన్ లోని పూలే గారి విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహాత్మా పూలే అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం, సమాన హక్కుల సాధన కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహోన్నత వ్యక్తి అని పేర్కొన్నారు. సమాజంలో కుల వివక్షను నిర్మూలించి సమానత్వాన్ని నెలకొల్పడంలో ఆయన చేసిన సేవలు అపారమని తెలిపారు.అలాగే, తన సహచరిణి సావిత్రీబాయి పూలే గారితో కలిసి 1848లో బాలికల కోసం దేశంలోనే తొలి పాఠశాలను స్థాపించి మహిళా సాధికారతకు బాటలు వేసారని కొనియాడారు.
మహాత్మా పూలే ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టి సమాన సమాజ నిర్మాణానికి కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
జ్యోతీ రావు పూలే ఆశయాలకు అనుగుణంగా బడుగు బలహీన వర్గాల కోసం పని చేస్తాం;చమర్తి జగన్ మోహన్ రాజు
RELATED ARTICLES

