ePaper
Monday, April 6, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్పాఠశాల వార్షికోత్సవంలో పాల్గొన్న స్టేట్ డైరెక్టర్ వీరభద్రుడు

పాఠశాల వార్షికోత్సవంలో పాల్గొన్న స్టేట్ డైరెక్టర్ వీరభద్రుడు

📰 Generate e-Paper Clip

సిద్ధవటం- (ప్రజా సీమ)

సిద్ధవటం మండలం మాధవరం గ్రామపంచాయతీ లోని పార్వతిపురంలోని విజయభారతి యుపి స్కూల్ 9వ వార్షికోత్సవం సభలో ఏపీ స్టేట్ నూర్ భాషా / దూదేకుల కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ నాగూరు వీరభద్రుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిల్లలు అందరూ శ్రద్ధగా చదువుకొని, కష్టపడి శ్రమించి మంచిగా చదువుకొని ఉత్తీర్ణతలో మంచి రిజల్ట్ చూపించి ఉపాధ్యాయులకును, తల్లిదండ్రులకును మంచి పేరు తీసుకురావాలని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో సిద్ధవటం మండల సింగిల్ విండో చైర్మన్ దారపునేని దశరథ రామానాయుడు కూడా ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్కూల్ యాజమాన్యం బొగ్గడి నాగేశ్వర్ రెడ్డి స్టేట్ డైరెక్టర్ కు, సింగల్ విండో చైర్మన్ లకు శాలవా వేసి ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో సిద్ధవటం మండలం ఐ టి డి పి అధ్యక్షులు పెగడ హరి ప్రసాద్, మాధవరం వన్ గ్రామపంచాయతీ టిడిపి ప్రధాన కార్యదర్శి మామిళ్ల మురళి రాయలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!