ePaper
Monday, April 6, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్వాట్సాప్లో కొత్త ఫీచర్.. 15 నిమిషాల్లో మెసేజ్ డిలీట్!

వాట్సాప్లో కొత్త ఫీచర్.. 15 నిమిషాల్లో మెసేజ్ డిలీట్!

📰 Generate e-Paper Clip

వాట్సాప్ యూజర్లకు త్వరలో కొత్త ప్రైవసీ ఫీచర్ అందుబాటులోకి రానుంది. ఈ ఫీచర్‌ను యాక్టివేట్ చేస్తే, చాట్‌లో పంపిన మెసేజ్లు స్వయంగా కొంత సమయం తర్వాత డిలీట్ అవుతాయి. ప్రత్యేకంగా, ఒక మెసేజ్ ఓపెన్ చేసిన వెంటనే 15 నిమిషాల కౌంట్‌డౌన్ ప్రారంభమవుతుంది. ఆ సమయం ముగిసిన వెంటనే, ఆ మెసేజ్ సెండర్ మరియు రిసీవర్ ఇద్దరి చాట్‌ల నుంచి పూర్తిగా తొలగిపోతుంది.

అదే సమయంలో, ఓపెన్ చేయని మెసేజ్లు మాత్రం 24 గంటల వరకు అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం ఈ ఫీచర్ అభివృద్ధి దశలో ఉంది. ముఖ్యంగా OTPలు, పాస్‌వర్డ్స్ వంటి సున్నితమైన సమాచారాన్ని షేర్ చేసే యూజర్లకు ఇది మరింత సురక్షిత అనుభవాన్ని అందించనుంది.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!