మదనపల్లి, మార్చి 16(ప్రజా సీమ ప్రతినిధి):: మదనపల్లి కలెక్టరేట్లోని కోర్టు హాలులో సోమవారం అన్నమయ్య జిల్లా మదనపల్లి కేంద్రంగా నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం, పిజిఆర్ఎస్) కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ఆయా మండలాల నుంచి వివిధ రకాల సమస్యలతో వచ్చిన అర్జీదారుల నుండి జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అర్జీలను స్వీకరించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని కోర్టు హాల్ నందు జిల్లా కలెక్టర్ తో పాటు అర్జీలను స్వీకరించే కార్యక్రమంలో ఇంచార్జ్ జాయింట్ కలెక్టర్ మధుసూదన్ రావు , మదనపల్లి సబ్ కలెక్టర్ చల్లాకళ్యాణి, ఏడి సర్వే భరత్ కుమార్, జి ఎస్ డబ్ల్యూ ఎస్ లక్ష్మీపతి, డ్వామా పిడి వెంకటరత్నం ఆయా శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కార వేదిక అర్జీలను పెండింగ్ ఉంచకుండా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పిజిఆర్ఎస్ అర్జీలకు సంబంధించి ఉన్నతాధికారులతో సమీక్ష చేస్తున్నారన్నారు. జిల్లా అధికారులు అర్జీలను సకాలంలో పరిష్కరించాలని, ఆయా శాఖల పరిధిలో పిజిఆర్ఎస్ గ్రీవెన్స్ పై ఆడిట్ నిర్వహించాలన్నారు. అర్జీదారులతో నేరుగా మాట్లాడాలని, పెండింగ్ ఆడిట్ పూర్తి చేయాలన్నారు. జిల్లా అధికారులు వారి పరిధిలో ఎలాంటి పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు అర్జీలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. డివిజన్, నియోజకవర్గ, మండల స్థాయి ప్రత్యేక అధికారులు వారికి కేటాయించినమండలాలను, గ్రామాలను పర్యటించి అక్కడి సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు కృషి చేయాలని తెలిపారు. జిల్లాలోని ఆయా శాఖల అధికారులు వారికి కేటాయించిన లక్ష్యాలను చేరుకునే విధంగా అధికారులు క్రమశిక్షణతో పని చేయాలని తెలిపారు. ఈ సందర్భంగా ప్రజల నుండి 346 అర్జీలను జిల్లా కలెక్టర్ స్వీకరించారు.
*ప్రజల నుండి అందిన కొన్ని విజ్ఞప్తులు*
రామసముద్రం మండలం,నారిగానిపల్లి గ్రామ ప్రజలు మా గ్రామంలో ఏర్పాటు చేయవలసినటువంటి ప్రభుత్వ ఆసుపత్రిని, మా గ్రామంలో కాకుండా ప్రస్తుతం కమ్మవారిపల్లిలో ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం చేపడుతున్నందున, దాన్ని పరిశీలించి నారిగానిపల్లి ప్రభుత్వ ఆసుపత్రి ఏర్పాటు చేయాలని గ్రామ ప్రజలు జిల్లా కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు.బి.కొత్తకోట, స్థానిక బజారు వీధిలో కాపురం ఉన్నటువంటి బి. దినకర్ కుమార్ అనారోగ్యం కారణంగా నడవలేని పరిస్థితిలో ఉన్నందున, క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ వేలూరులో చికిత్స చేయించుకున్నాను. ప్రస్తుతం లేవలేని పరిస్థితిలో మంచానికే పరిమితమైన నని
జీవనాధారం లేకపోవడంతో భార్యా పిల్లలను పోషించుకోవడం కష్టంగా ఉన్నదని
ప్రభుత్వం నుంచి వికలాంగ పింఛన్ మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ కు అర్జీని సమర్పించుకున్నారు.అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన బి.మనోహర్. నాకు వైకల్యం ఉండి నడవలేని పరిస్థితిలో ఉన్నాను. గతంలో మంజూరైన నా వైకల్య పెన్షన్ ప్రస్తుతం నిలిపివేయబడింది. దయచేసి నా పరిస్థితిని పరిశీలించి నాకు వైకల్య పెన్షన్ మళ్లీ మంజూరు చేసి న్యాయం చేయవలసిందిగా జిల్లా కలెక్టర్ ను విన్నవించుకున్నారు.ఈ కార్యక్రమంలో అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్ గారికి వివిధ రకాల అర్జీలు సమర్పించారు. ఈ సమస్యలన్నీ నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఎండార్స్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా, మండల స్థాయి అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

