టీ20 వరల్డ్ కప్ – 2026ను గెలుచుకొని దేశానికి అపారమైన గౌరవం తీసుకొచ్చిన టీమ్ ఇండియాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా యువజన&క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ప్రపంచ స్థాయి టోర్నమెంట్‌లో అద్భుత ప్రతిభ కనబరిచి ఛాంపియన్స్‌గా నిలవడం ప్రతి భారతీయుడికి గర్వకారణమని ఆయన పేర్కొన్నారు.టీమ్ ఇండియా ఆటగాళ్లు చూపిన అంకితభావం, కృషి, జట్టు భావన యువతకు ఆదర్శంగా నిలుస్తుందని మంత్రి తెలిపారు. ఈ విజయం దేశవ్యాప్తంగా ఉన్న యువ క్రీడాకారులకు మరింత ప్రేరణనిస్తుందని ఆయన అన్నారు.
భారత క్రికెట్ జట్టు భవిష్యత్తులో కూడా ఇలాంటి విజయాలను మరెన్నో సాధించి దేశ కీర్తిని అంతర్జాతీయ స్థాయిలో మరింతగా చాటాలని మంత్రి ఆకాంక్షించారు. టీమ్ ఇండియా ఆటగాళ్లు మరియు కోచింగ్ సిబ్బందికి మరోసారి అభినందనలు తెలియజేశారు.
టీమ్ ఇండియాకు హృదయపూర్వక అభినందనలు తెలిపిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
RELATED ARTICLES

