ePaper
Sunday, August 30, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఎడిటోరియల్సర్వేనంబర్ 130 భూమిలోకి ప్రవేశిస్తే చర్యలు: తహసీల్దార్ అమర్నాథ్ హెచ్చరిక

సర్వేనంబర్ 130 భూమిలోకి ప్రవేశిస్తే చర్యలు: తహసీల్దార్ అమర్నాథ్ హెచ్చరిక

📰 Generate e-Paper Clip

సర్వేనంబర్ 130 భూమిలోకి ప్రవేశిస్తే చర్యలు: తహసీల్దార్ అమర్నాథ్ హెచ్చరిక

రైల్వేకోడూరు ప్రజాసీమ

రైల్వేకోడూరు: సర్వే నంబర్ 130లోని 300 ఎకరాల విస్తీర్ణం గల భూమిలోకి ఎవరూ ప్రవేశించకుండా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసినట్లు రైల్వేకోడూరు తహసీల్దార్ అమర్నాథ్ తెలిపారు. ఈ భూమిలోకి ప్రవేశించేందుకు ఇప్పటివరకు ప్రయత్నించిన వారికి ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసినట్లు పేర్కొన్నారు.

మరోసారి భూమిలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించినా, భూమిని ఆక్రమించేందుకు యత్నించినా ల్యాండ్ గ్రాబింగ్ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ హెచ్చరించారు. సంబంధిత భూమి వద్ద ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా అధికారులు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.

అదేవిధంగా ప్రత్యేక తనిఖీ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రాలను కూడా పరిశీలించినట్లు తహసీల్దార్ అమర్నాథ్ వెల్లడించారు. పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులు, భద్రతా ఏర్పాట్లు తదితర అంశాలను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!