రైల్వేకోడూరులో ఆర్‌పీఐ (అథవాలే) పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం
రైల్వేకోడూరు ప్రజా సీమ
రైల్వేకోడూరులో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్‌పీఐ–అథవాలే) పార్టీ స్థానిక ఆర్ఆర్ కాంప్లెక్స్ ప్రక్కన నూతనంగా పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు.
ఆర్‌పీఐ (అథవాలే) జాతీయ అధ్యక్షుడు, కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారత శాఖ సహాయ మంత్రి రాందాస్ అథవాలే ఆదేశాలమేరకు పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఆర్.పి.ఐ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన రాష్ట్ర అధ్యక్షుడు కొమ్మారెడ్డి బ్రహ్మానంద రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ భావజాలంతో మనం ముందుకు వెళదామని అంతేకాకుండా ఈ పార్టీ కుల మత వర్గం లేని పార్టీ అని ప్రతి ఒక్కరిని కలుపుకుపోయే పార్టీ అని ఇది మన అందరి పార్టీ ఇందులో మన హక్కులను కూడా సాధించుకోవచ్చని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆర్‌పీఐ (అథవాలే) రాష్ట్ర అధ్యక్షుడు కొమ్మారెడ్డి బ్రహ్మానంద రెడ్డి, తిరుపతి జిల్లా అధ్యక్షులు చోడవరం సుబ్బ నరసయ్య, కడప రమణ , ఆర్ పి ఐ స్టేట్ బీసీ సెల్ ప్రెసిడెంట్ వంకదార శ్రీనివాసరావు, ఆర్.పి.ఐ స్టేట్ జనరల్ సెక్రటరీ జవాజి ఫణేదర్, ఆర్ పి ఐ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ముత్తయ్య, ఆర్ పి ఐ మహిళా అధ్యక్షరాలు కప్పలా ప్రమీల, నెల్లూరు జిల్లా మహిళా ప్రెసిడెంట్ షావుకారు సరస్వతి మరియు కార్యకర్తలు అభిమానులు మొదలగు నాయకులు పాల్గొనడం జరిగినది.

