దెబ్బతిన్న అరటి తోటలు, పంట పొలాలను పరిశీలించిన ఎమ్మెల్యే అరవ శ్రీధర్
రైల్వేకోడూరు ప్రజా సీమ
రైల్వేకోడూరు మండలం ఓబనపల్లి గ్రామంలో నిన్న రాత్రి కురిసిన అకస్మాత్తు భారీ వర్షం కారణంగా దెబ్బతిన్న అరటి తోటలు, పలు పంట పొలాలను రైల్వే కోడూరు శాసనసభ్యులు అరవ శ్రీధర్ పరిశీలించారు.వర్షం కారణంగా పంటలకు జరిగిన నష్టాన్ని రైతులను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే గారు, దెబ్బతిన్న అరటి తోటలు, పంట పొలాలను స్వయంగా పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా రైతులు తమకు జరిగిన పంట నష్టాన్ని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువచ్చారు.రైతులు అధైర్యపడాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారు భరోసా ఇచ్చారు.* పంట నష్టం వివరాలను అధికారుల ద్వారా సేకరించి, నష్టపోయిన రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం లో రాష్ట్ర కార్యదర్శి తాతం శెట్టి నాగేంద్ర , అధికారులు, రైతులు పాల్కొన్నారు,

