ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న ముఖేష్
రైల్వేకోడూరు ప్రజా సీమ
రైల్వేకోడూరు, కొత్తబజార్: విజ్‌డమ్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్‌లో అకడమిక్ ఇన్‌చార్జ్, బయాలజీ ఉపాధ్యాయుడిగా సేవలందిస్తున్న పి. ముఖేష్ సార్‌కు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు లభించింది. అపూస్మా ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో తిరుపతి జిల్లా డీఈఓ చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును అందుకున్నారు.ముఖేష్‌కు అవార్డు లభించడంపై పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ టి. ప్రదీప్, ప్రిన్సిపాల్ టి. ప్రియాంక, అడ్మిన్ డైరెక్టర్ టి. మదన్ మోహన్, ఇన్‌చార్జ్ వి. శివప్రకాష్ అభినందనలు తెలిపారు.

