మంగంపేట స్థానిక నిర్వాసితులకు ఏపీఎండిసి పబ్లిక్ స్కూల్ సీట్లు కేటాఇంచకపోవడంపై తల్లెం ఆగ్రహం
రైల్వేకోడూరు మేజర్ న్యూస్
తిరుపతి జిల్లా, రైల్వేకోడూరు నియోజకవర్గం, ఓబులవారిపల్లె మండలం, మంగంపేట గ్రామ పంచాయతీ పరిధిలో ఏపీఎండీసీ కార్పొరేట్ సామాజిక బాధ్యత సి ఎస్ ఆర్ కింద ఏర్పాటు చేసిన ఏపీఎండీసీ పబ్లిక్ స్కూల్లో ఎదురవుతున్న సమస్యలపై రాయలసీమ జోన్ బూత్ కమిటీ అధ్యక్షులు డి ఆర్ యు సిసి సభ్యులు తల్లెం భరత్ కుమార్ రెడ్డి మరియు స్థానిక విద్యార్థుల తల్లిదండ్రులు మీడియా సమావేశంలో మాట్లాడుతూ
2018లో ఏర్పాటు చేసిన ఈ పబ్లిక్ స్కూల్లో స్థానిక డేంజర్ జోన్ పరిధిలోని గ్రామాల పిల్లలకు, కార్మికులు, డ్రైవర్లు, క్లీనర్లు, ఏపీఎండీసీ ఉద్యోగుల పిల్లలకు మొదటి ప్రాధాన్యత ఇస్తామని యాజమాన్యం గతంలో హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. కానీ, నేడు స్థానిక పిల్లలకు సీట్లు ఇవ్వకుండా, దరఖాస్తు ఫారమ్ పేరిట ఒక్కొక్కరి వద్ద రూ. 300 వసూలు చేసి తిరస్కరించడం అత్యంత విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల నుండి దరఖాస్తులు స్వీకరించి, సీట్లు లేవని చెప్పడం తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోందన్నారు.
విద్యా నాణ్యత లోపం – అదనపు ఫీజుల భారం:
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సులోరియాలో ఏపీఎండీసీ నడుపుతున్న స్కూల్లో సీబీఎస్ఈ సిలబస్‌ను, విద్యార్థులకు యూనిఫాం, షూస్, బుక్కులు ఇచ్చి స్థానికులకు ఉచిత విద్య మొదటి ప్రాధాన్యతను ఇస్తున్నారని, కానీ మంగంపేటలో కూడా ఉచిత విద్య ,బుక్స్ ,షూస్ ఫీజు లేకుండా ఏర్పాటు చెయ్యాలని స్కూల్లో మాత్రం సాధారణ సిలబస్ పెట్టి నాణ్యత లేని విద్యను అందిస్తున్నారని మండిపడ్డారు. స్కూల్లో కనీసం విద్యార్థులకు సరిపడా లైబ్రరీ సౌకర్యం కూడా లేకపోవడం శోచనీయమన్నారు. రూ. 2,500 ఉండే పుస్తకాల ధరలను రూ. 6,000 నుండి రూ. 15,000 వరకు పెంచడమే కాకుండా, స్కూల్ ఫీజులను సైతం రూ. 6,000 నుండి రూ. 9,000 వరకు అదనంగా పెంచి తల్లిదండ్రులపై తీవ్ర భారం మోపుతున్నారని విమర్శించారు.
గత ప్రభుత్వంలో ప్రజాప్రతినిధుల చొరవతో మధ్యాహ్న భోజన పథకం, , కంప్యూ వ్యవస్థలను అందుబాటులోకి తెచ్చినప్పటికీ, నేడు ప్రైవేట్ యాజమాన్యం చేతుల్లోకి వెళ్లడంతో విద్యా ప్రమాణాలు క్షీణించాయని ఆరోపించారు. మంగంపేట నుంచి వందల కోట్ల రూపాయల ఆదాయం పొందుతున్న ఏపీఎండీసీ, స్థానిక పిల్లల చదువుల పట్ల నిర్లక్ష్యం వహించడం సరికాదన్నారు.
ఈ సమస్యలపై తక్షణమే జిల్లా కలెక్టర్ విచారణ జరిపి బాధితులకు తగిన న్యాయం చేయాలని అదేవిధంగా మంగంపేట ఏపీఎండీసీ స్కూల్లో సీబీఎస్ఈ సిలబస్‌ను అమలు చేయాలని, స్థానిక పిల్లలందరికీ సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. యాజమాన్యం తీరు మారకపోతే న్యాయస్థానాన్ని (హైకోర్టు) ఆశ్రయిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో తల్లెం భరత్ కుమార్ రెడ్డి, అందే వెంకటేష్,మొగిలి నవీన్, చంటి, శివ కుమార్ రెడ్డి, భార్గవి, మొదలగువారు పాల్గొన్నారు.

