ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ చేసిన యువనేత ముక్కా సాయి వికాస్ రెడ్డి
రైల్వేకోడూరు ప్రజాసీమ
సీఎం బలిజ పల్లి గ్రామంలో లబ్ధిదారుల వద్దకే వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ చేసిన యువనేత ముక్కా సాయి వికాస్ రెడ్డి
ఓబులువారిపల్లి మండలం, ముక్కావారిపల్లి పంచాయతీ పరిధిలోని సీఎం బలిజపల్లి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపి పార్టీ ఇంచార్జ్ ముక్కా రూపానంద రెడ్డి తనయుడు ముక్కా సాయి వికాస్ రెడ్డి పాల్గొని, లబ్ధిదారుల వద్దకే వెళ్లి పెన్షన్లను స్వయంగా అందజేశారు.
ఈ సందర్భంగా ముక్కా సాయి వికాస్ రెడ్డి మాట్లాడుతూ.. పేదలు, వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల ద్వారా ఆర్థిక భరోసా కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా కృషి చేస్తామని పేర్కొన్నారు.
పెన్షన్ అందుకున్న లబ్ధిదారులతో వికాస్ రెడ్డి ఆప్యాయంగా మాట్లాడి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అందడంపై లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, స్థానికులు పాల్గొన్నారు.

