ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల ఆరోపణలకు SFI భయపడదు — విద్యార్థుల హక్కుల కోసం పోరాటం ఆగదు
రైల్వేకోడూరు ప్రజా సీమ
రైల్వే కోడూరు ప్రాంతంలోని కొన్ని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు SFI నాయకులపై, ముఖ్యంగా నా మీద చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నాను. విద్యార్థుల హక్కుల కోసం ప్రశ్నించడం, ప్రభుత్వ నిబంధనలు అమలయ్యేలా పోరాడడం SFI బాధ్యత. అటువంటి బాధ్యతను నిర్వర్తిస్తున్న మాపై నిరాధార ఆరోపణలు చేస్తూ ప్రజల్లో అపోహలు సృష్టించే ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం.గతంలోనూ SFI విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసమే ప్రైవేట్ పాఠశాలలపై ప్రశ్నలు లేవనెత్తింది. మా పోరాటం ఏ ఒక్క పాఠశాల యాజమాన్యానికి వ్యతిరేకంగా వ్యక్తిగత కక్షతో చేస్తున్నది కాదు. విద్యార్థులకు న్యాయం జరగాలనే లక్ష్యంతో చేస్తున్న పోరాటం. గతంలో ఒక పాఠశాల సమస్యపై విద్యార్థుల హక్కుల కోసం పోరాడుతున్న సమయంలో, తమకు అనుకూలంగా వ్యవహరించాలని కొందరు యాజమాన్యాలు ప్రయత్నించినప్పటికీ, మేము వాటిని పట్టించుకోకుండా విద్యార్థుల పక్షాన నిలబడ్డాం. నేటికీ అదే నిబద్ధతతో ముందుకు సాగుతున్నాం.మతం, కులం పేరుతో ఆరోపణలు చేయడం తగదు విద్యార్థుల సమస్యలను పక్కదారి పట్టించేందుకు SFI నాయకులపై కులం, మతం పేరుతో ఆరోపణలు చేయడం ఆమోదయోగ్యం కాదు. ముఖ్యంగా, ‘లవ్ జిహాద్’ వంటి పదాలను ఉపయోగిస్తూ ముస్లిం సమాజాన్ని లక్ష్యంగా చేసుకునే విధంగా వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.ఈ అంశాలపై పాఠశాలల వారీగా సమాచారం సేకరించి, అవసరమైన ఆధారాలతో జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా విద్యాశాఖ అధికారి (DEO) గారికి వినతిపత్రాలు అందజేస్తాం. నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే సంబంధిత యాజమాన్యాలపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తాం.
SFI పోరాటాన్ని ఆరోపణలతో ఆపలేరు!
ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలకు మేము స్పష్టంగా తెలియజేస్తున్నాం: విద్యార్థుల సమస్యలను పరిష్కరించకుండా, ప్రశ్నించే విద్యార్థి సంఘాల నాయకులపై ఆరోపణలు చేయడం వల్ల సమస్యలు పరిష్కారం కావు. విద్యార్థుల హక్కుల పరిరక్షణే SFI ప్రధాన లక్ష్యం.
మాపై వస్తున్న ఆరోపణలకు అవసరమైన చోట వాస్తవాలతో సమాధానం చెబుతాం. అదే సమయంలో, విద్యార్థుల హక్కులకు భంగం కలిగించే ఏ చర్యనైనా ప్రశ్నిస్తాం. అవసరమైతే విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజాసంఘాలు మరియు ఇతర విద్యార్థి సంఘాలను కలుపుకొని ప్రజాస్వామ్యబద్ధంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతాం.

