పార్టీ ఆదేశిస్తే పోటీకి సిద్ధమంటున్న బీజేవైఎం యువ మోర్చా కార్యదర్శి
రైల్వేకోడూరు మేజర్న్యూస్: రైల్వేకోడూరు:
రైల్వేకోడూరు మండల పరిధిలోని కోడూ రు-7 ఎంపీటీసీ స్థానం బీసీలకు కేటాయిం చడంతో రాజకీయంగా ఆసక్తి నెలకొంది. కూటమి తరఫున బీసీ అభ్యర్థుల పేర్లపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో తిరుపతి జిల్లా బీజేవైఎం యువ మోర్చా కార్యదర్శి సాయి ఆచారి పేరు వినిపిస్తోంది. పార్టీ అధిష్ఠానం ఆదేశిస్తే కోడూరు-7 ఎంపీటీసీ స్థానం నుంచి పోటీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు సాయి ఆచారి వెల్లడించినట్లు సమాచారం. అయితే కూటమి అభ్యర్థిగా అవకాశం లభిస్తుందనేది వేచి చూడాలి.

