ePaper
Thursday, October 8, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper

📰 Generate e-Paper Clip

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను  కలిసిన కొరముట్ల శ్రీనివాసులు

రైల్వే కోడూరు ప్రజాసేవ

తాడేపల్లి: తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం మధ్యాహ్నం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కోడూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్, మాజీ శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా ఇరువురు కొద్దిసేపు వివిధ అంశాలపై మాట్లాడినట్లు తెలిపారు. కోడూరు నియోజకవర్గానికి సంబంధించిన రాజకీయ, ప్రజా సమస్యలు, పార్టీ కార్యక్రమాలపై కూడా చర్చ జరిగినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

ఈ భేటీలో పార్టీకి సంబంధించిన తాజా పరిణామాలు, భవిష్యత్ కార్యక్రమాలపై కూడా అభిప్రాయాలు పంచుకున్నట్లు సమాచారం.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!