జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ముక్కా వరలక్ష్మి
రైల్వేకోడూరు మేజర్ న్యూస్
జెడ్పీ బాలికల పాఠశాలలో ముక్కా వరలక్ష్మి గారి ఆకస్మిక తనిఖీ.. విద్యార్థినుల సమస్యలపై ఆరా..అభివృద్ధికి హామీ*
రైల్వే కోడూరు పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలను *రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్, కూడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి సతీమణి ముక్కా వరలక్ష్మి ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థినులకు అందుతున్న విద్యా సౌకర్యాలు, తాగునీటి వసతి, మరుగుదొడ్లు, తరగతి గదులు, విద్యుత్ సదుపాయాలు, పరిశుభ్రత, ఫర్నిచర్ తదితర వసతులను ఆమె పరిశీలించారు. విద్యార్థినులతో మాట్లాడి పాఠశాలలో ఎదుర్కొంటున్న సమస్యలు, వారికి అవసరమైన సౌకర్యాల గురించి తెలుసుకున్నారు.
పాఠశాలలో విద్యార్థినులకు మరింత మెరుగైన వాతావరణం కల్పించేందుకు అదనపు తరగతి గదులు, బెంచీలు, తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్ల మరమ్మతులు, పరిశుభ్రతకు అవసరమైన చర్యలు, విద్యుత్ సదుపాయాల మెరుగుదల, క్రీడా సామగ్రి వంటి అవసరాలను గుర్తించారు.
విద్యార్థినుల చదువుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన మౌలిక వసతులు కల్పించే దిశగా కృషి చేస్తామని ముక్కా వరలక్ష్మి గారు హామీ ఇచ్చారు. పాఠశాల అభివృద్ధికి అవసరమైన చర్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, సమస్యల పరిష్కారానికి తన వంతు సహకారం అందిస్తామని తెలిపారు.
విద్యార్థినుల భవిష్యత్తు కోసం విద్యతో పాటు మంచి మౌలిక వసతులు కూడా ఎంతో అవసరమని, పాఠశాలలను అన్ని విధాలా అభివృద్ధి చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆమె పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, పాఠశాల సిబ్బంది, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

