ట్రాఫిక్ సమస్యల నివారణకు చర్యలు – డ్రైవర్లకు రోడ్డు భద్రతపై కౌన్సెలింగ్
రైల్వేకోడూరు మేజర్ న్యూస్
రైల్వే కోడూరు పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు, రద్దీ మరియు ప్రజలకు కలుగుతున్న అసౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని రైల్వే కోడూరు పోలీసుల ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు చేపట్టారు.
ఈ సందర్భంగా రైల్వే కోడూరు సీఐ శ్రీ చంద్రశేఖర్ గారు డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తూ కౌన్సెలింగ్ నిర్వహించారు. వాహనాలను రోడ్లపై ఇష్టానుసారంగా నిలిపి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించవద్దని, నిబంధనలు పాటిస్తూ వాహనాలు నడపాలని సూచించారు.డ్రైవర్లు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, అధిక వేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్, రాంగ్ రూట్‌లో ప్రయాణించడం, డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వినియోగించడం వంటి చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు. ప్రయాణికుల భద్రతతో పాటు ఇతర వాహనదారులు మరియు పాదచారుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు.ప్రధాన రహదారులు, కూడళ్ల వద్ద ట్రాఫిక్‌కు ఇబ్బంది కలిగించే విధంగా వాహనాలను నిలిపితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని సీఐ శ్రీ చంద్రశేఖర్ గారు హెచ్చరించారు. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు.ప్రజలు మరియు వాహనదారులు పోలీసులకు సహకరించి రైల్వే కోడూరు పట్టణంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు సహకరించాలని కోరారు.

