ePaper
Friday, October 16, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఎడిటోరియల్రైల్వే కోడూరులో వైకాపా వైఖరిపై టీడీపీ నేతల తీవ్ర ధ్వజం

రైల్వే కోడూరులో వైకాపా వైఖరిపై టీడీపీ నేతల తీవ్ర ధ్వజం

📰 Generate e-Paper Clip

*రైల్వే కోడూరులో వైకాపా వైఖరిపై టీడీపీ నేతల తీవ్ర ధ్వజం

డీఎస్సీపై అసత్య ఆరోపణలు మానాలి: సాంస్కృతిక విభాగ అధ్యక్షులు పంతగాని ప్రసాద్, ఖాదీ బోర్డు చైర్మన్ కేకే చౌదరి*

తిరుపతి జిల్లా రైల్వే కోడూరు పట్టణంలోని సాంస్కృతిక శాఖ విభాగ అధ్యక్షులు పంతగాని ప్రసాద్ కార్యాలయంలో టీడీపీ నేతలు విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ నాయకులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు, ర్యాలీలపై టీడీపీ నాయకులు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

పంతగాని ప్రసాద్ వ్యాఖ్యలు:

జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు: వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వైఖరిని ఎండగడుతూ, “*కొండ బద్దలు కొట్టి చెప్తున్నాం… మీరు ఇక ఎప్పటికీ గెలవరు, మీకు ఆ అవకాశం లేదు*” అని స్పష్టం చేశారు.డీఎస్సీ వ్యవహారంపై స్పందన: డీఎస్సీ ప్రక్రియలో అక్రమాలు, ప్రశ్నాపత్రాలు లీక్ (అవుట్) అయ్యాయని వైకాపా నేతలు చెబుతున్న మాటలు కేవలం పచ్చి అబద్ధాలని కొట్టిపారేశారు.మంత్రి లోకేష్ రాజీనామా డిమాండ్‌పై ఆగ్రహం: ఎలాంటి ఆధారాలు లేకుండా వైకాపా చెప్పే అసత్యపు మాటలు పట్టుకుని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.

ఖాదీ గ్రామీణ అభివృద్ధి శాఖ చైర్మన్ కేకే చౌదరి వ్యాఖ్యలు:

సాక్ష్యాలు ఉంటే చూపించండి: డీఎస్సీలో అవినీతి జరిగిందని ఆరోపిస్తున్న వైకాపా నాయకులు, నిజంగా తమ వద్ద ఏమైనా ఆధారాలు లేదా సాక్ష్యాలు ఉంటే బహిరంగంగా చూపించాలని సవాల్ విసిరారు.బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించవద్దు: పనీ పాట లేకుండా రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తూ, డీఎస్సీలో అవినీతి జరిగిందని, మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని మాట్లాడటం సరైన పద్ధతి కాదని హితవు పలికారు.వైకాపా తీరుపై మండిపాటు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా, ప్రభుత్వ ఉద్యోగులైన టీచర్లు ప్రతిపక్ష పార్టీకి మద్దతుగా ధర్నా చేయడం అనే విచిత్ర సంస్కృతి ఒక్క వైకాపా పార్టీకే చెల్లుతుందని ఎద్దేవా చేశారు.ఈ సమావేశంలో పలువురు స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైకాపా నాయకులు ప్రజలను మభ్యపెట్టే రాజకీయాలు మానాలని డిమాండ్ చేశారు.

Previous article
Next article
RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!