మద్యం సేవించి వాహనాలు నడపవద్దు – సీఐ చంద్రశేఖర్ హెచ్చరిక
రైల్వేకోడూరు న్యూస్
రైల్వే కోడూరు పట్టణం మరియు పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను కోడూరు పట్టణ ఇన్స్పెక్టర్ చంద్ర శేఖర్ తిరుపతి కడప నేషనల్ హైవే లో డాబా వద్ద నిర్వహించారు.
ఈ సందర్భంగా మద్యం సేవించి వాహనం నడపడం వల్ల డ్రైవర్ మాత్రమే కాకుండా అమాయక ప్రజల ప్రాణాలు కూడా ప్రమాదంలో పడతాయని ఆయన పేర్కొన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన వారిపై మోటార్ వాహన చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకొని, న్యాయస్థానంలో హాజరుపరుస్తామని హెచ్చరించారు. మద్యం మత్తులో వాహనం నడపడం రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాలలో ఒకటని తెలిపారు.రైల్వే కోడూరు పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ సురక్షిత ప్రయాణం చేయాలని సీఐ చంద్రశేఖర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

