ePaper
Friday, October 16, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఎడిటోరియల్నిబంధనలు ఉల్లంగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు  సీఐ చంద్రశేఖర్

నిబంధనలు ఉల్లంగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు  సీఐ చంద్రశేఖర్

📰 Generate e-Paper Clip


  1. బుల్లెట్ సైలెన్సర్లు, నిబంధనలకు విరుద్ధమైన ఫ్యాన్సీ నంబర్ ప్లేట్లు మరియు అనుమతి లేని స్టిక్కర్లపై చర్యలు తీసుకుంటున్న  సీఐ చంద్రశేఖర్

రైల్వేకోడూరు న్యూస్

తిరుపతి జిల్లా పోలీసు సూపరింటెండెంట్  ఆదేశాల మేరకు, రేణిగుంట సబ్-డివిజన్ డీఎస్పీ గారి పర్యవేక్షణలో రైల్వే కోడూరు పోలీస్ స్టేషన్ పరిధిలో అనధికారికంగా మార్పులు చేసిన బుల్లెట్ సైలెన్సర్లు, నిబంధనలకు విరుద్ధమైన ఫ్యాన్సీ నంబర్ ప్లేట్లు మరియు అనుమతి లేని స్టిక్కర్లపై మరియు మైనర్ డ్రైవింగ్ పైన ప్రత్యేక తనిఖీలు నిర్వహించినట్లు రైల్వే కోడూరు సర్కిల్ ఇన్‌స్పెక్టర్  చంద్రశేఖర్ తెలిపారు.

ఈ ప్రత్యేక తనిఖీలలో అధిక శబ్దం వచ్చేలా చట్టవిరుద్ధంగా మార్పులు చేసిన బుల్లెట్ సైలెన్సర్లు, నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన ఫ్యాన్సీ నంబర్ ప్లేట్లు, అలాగే అనుమతి లేని పోలీస్, ప్రెస్, రెవెన్యూ మరియు ఇతర స్టిక్కర్లతో సంచరిస్తున్న వాహనాలను గుర్తించి, సంబంధిత వాహనదారులపై మోటారు వాహనాల చట్టం ప్రకారం చర్యలు తీసుకోవడమైనది.

ఇలాంటి ప్రత్యేక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై ఎలాంటి మినహాయింపు లేకుండా కఠిన చర్యలు తీసుకుంటామని రైల్వే కోడూరు సీఐ శ్రీ చంద్రశేఖర్ స్పష్టం చేశారు. ప్రజలు ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ సురక్షితమైన రవాణాకు సహకరించాలని ఆయన కోరారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!