రైల్వే కోడూరు:ఈరోజు ఉదయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తల కోసం ప్రత్యేకంగా రూపొందించిన జగనన్న 2.0 యాప్ కు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించి అనంతరం పలువురు వైఎస్ఆర్సిపి కార్యకర్తల ఫోన్లలల్లో యాప్ ను ఇన్స్టాల్ చేయించి ఏ విధంగా ఉపయోగించాలో వారికి తెలియజేసి అనంతరం పత్రికా విలేకరులతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుండి వైఎస్ఆర్సిపి సోషల్ మీడియానే టార్గెట్గా పెట్టుకుని వైఎస్ఆర్సిపి అధికారిక ఖాతాలను తొలగించడం వైఎస్ఆర్సిపి కార్యకర్తల పైన అక్రమ కేసులు బాణాయించడం జరుగుతుందని,దానికి భిన్నంగా “జగనన్న 2.0” యాప్ను రూపొందించి ప్రతి కార్యకర్త తమ తమ అభ్యంతరాలు తెలియజేస్తూ, ఎక్కడైనా ఏమైనా సమస్యలు జరుగితే కార్యకర్తలను ఇబ్బంది పెట్టి అక్రమ కేసులు బాణాయిస్తే,ఆ వివరాలను యాప్ లో ఎక్కించడం, పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు యాప్ లో లైవ్ ద్వారా చూడడం, వంటి, మరెన్నో కార్యక్రమాలు యాప్ ద్వారా ఉపయోగపడుతుందని, *వైఎస్ఆర్సిపి రాష్ట్ర అధికార ప్రతినిధి& కోడూరు నియోజకవర్గ ఇన్చార్జ్& మాజీ శాసనసభ్యులు కొరుముట్ల శ్రీనివాసులు గారు తెలియజేశారు. ఈ
కార్యక్రమంలో సీనియర్ నాయకులు మాదినేని వెంకటరెడ్డి, రాయలసీమ జోన్ బూత్ కమిటీ అధ్యక్షుడు తల్లెం భరత్ కుమార్ రెడ్డి, జడ్పిటిసి రత్నమ్మ,జిల్లా యువజన విభాగం అధ్యక్షులు శివారెడ్డి, పట్టణ అధ్యక్షుడు సిహెచ్ రమేష్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మందల నాగేంద్ర, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ సుబ్బరామరాజు, ఎంపీటీసీలు జనార్ధన్ రాజు, బండారు మల్లికార్జున, రౌఫ్,పుష్పలత, ఆంజనేయులు, మాజీ సర్పంచులు, బుడిగి శివయ్య, ప్రభాకర్,మాజీ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు గునిశెట్టి రమేష్, మైనార్టీ నాయకులు, ముజీబ్, కరిముల్లా, మస్తాన్, కంపరాజు నాగేంద్ర రాజు,ఎక్స్ ఎంపీటీసీ బత్తిన ఆనందయ్య యాదవ్,దాడిశెట్టి సిద్దు రాయల్,రత్తయ్య,సోషల్ మీడియా సభ్యులు,లక్కీరెడ్డి రాజారెడ్డి, మనోహర యాదవ్, విజయ్, తదితరులు భారీగా పాల్గొన్నారు
కార్యకర్తల కోసమే 2.0 మాజీ ఎమ్మెల్యే కొరముట్ల
RELATED ARTICLES

